IND vs NZ : రాణించిన కోహ్లీ.. న్యూజిలాండ్ వరుస విజయాలకు భారత్ బ్రేక్.. 4 వికెట్ల తేడాతో గెలుపు
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.

India vs New Zealand
India vs New Zealand : వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువెళ్లింది. 274 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (95; 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. రోహిత్ శర్మ (46; 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (39 నాటౌట్; 44 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) శ్రేయస్ అయ్యర్ (33), కేఎల్ రాహుల్ (27) లు రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశాడు. బౌల్ట్, సాంట్నర్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
India ?? make it FIVE in a row!
Ravindra Jadeja with the winning runs ??
King Kohli ? reigns supreme in yet another run-chase for #TeamIndia ?#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/d6pQU7DSra
— BCCI (@BCCI) October 22, 2023
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (130; 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులు) శతకంతో చెలరేగాడు. రచిన్ రవీంద్ర (75; 87 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. డేవాన్ కాన్వే (0), టామ్ లేథమ్ (5), మార్క్ చాప్‌మన్ (6), మిచెల్ శాంట్నర్ (1) లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లు న్యూజిలాండ్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా బుమ్రా, సిరాజ్‌లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
మూడో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మిచెల్ ఇన్నింగ్సే హైలెట్. ఓపెనర్లు కాన్వే (0), విల్ యంగ్‌లు (17) లు విఫలం కావడంతో కివీస్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ఆరంభంలో ఆచితూచి ఆడారు. నిలదొక్కుకున్న తరువాత వేగం పెంచారు. భారత ఫీల్డర్లు పలు క్యాచ్‌లు వదిలేయడం కూడా ఈ జోడికి కలిసి వచ్చింది.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు.. 52 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు..

daryl mitchell pic@BLACKCAPS twitter
ఈ క్రమంలో రచిన్ 56 బంతుల్లో, మిచెల్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అర్ధశతకాల తరువాత ఈ జోడి వేగం పెంచింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని రచిన్‌ను ఔట్ చేయడం ద్వారా షమీ విడగొట్టాడు. రచిన్-మిచెల్‌లు మూడో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ మిచెల్ ధాటిగా ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. సరిగ్గా 100 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఆ తరువాత కూడా అతడు అదే తీరుతో బ్యాటింగ్ చేయడంతో కివీస్ స్కోరు 250 పరుగులు దాటింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అతడు ఔట్ అయ్యాడు.
రీ ఎంట్రీలో అదరగొట్టిన షమీ..

pic @bcci twitter
వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో షమీకి అవకాశం దక్కలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్య గాయపడడంతో కివీస్‌తో మ్యాచ్‌లో షమీ బరిలోకి దిగాడు. అతడు వేసిన మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 54 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లలో షమీకి ఇది రెండో ఐదు వికెట్ల ప్రదర్శన. కాగా.. భారత క్రికెటర్లలో ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రపంచకప్‌లలో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయలేదు. ఈ ఘనత సాధించిన మొదటి భారత ఆటగాడిగా షమీ రికార్డులకు ఎక్కాడు. తనకు వచ్చిన అవకాశాన్ని షమీ సద్వినియోగం చేసుకున్నాడు.