WTC Final 2021: ఫైనల్‌లో భారత్ ఓటమి.. నలుగురు విలన్లు ఎవరూ?

ప్రతిష్టాత్మకంగా భావించిన ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు పరాజయం పాలైంది. బ్యాట్స్ మెన్‌లు సరిగ్గా ఆడకపోవడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రీజులో నిలదొక్కుకోవడంలో భారత టాప్ ఆర్డర్ విఫలం అయ్యింది.

WTC Final 2021: ఫైనల్‌లో భారత్ ఓటమి.. నలుగురు విలన్లు ఎవరూ?

Wtc Final 2021

WTC Final 2021: ప్రతిష్టాత్మకంగా భావించిన ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు పరాజయం పాలైంది. బ్యాట్స్ మెన్‌లు సరిగ్గా ఆడకపోవడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రీజులో నిలదొక్కుకోవడంలో భారత టాప్ ఆర్డర్ విఫలం అయ్యింది. దీంతో ఈ మ్యాచ్లో భారత్ పెద్ద స్కోరు చేయలేక చతికిలపడింది. ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. 139 పరుగుల టార్గెట్‌ను మాత్రమే న్యూజిలాండ్‌కు ఇవ్వగా.. 45.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది కివీస్ జట్టు.

భారతదేశానికి ఈ ఇబ్బందికరమైన ఓటమిలో, ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాలను విలన్‌లుగా చెబుతున్నారు నెటిజన్లు. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ నుంచి మెరుగైన ఇన్నింగ్స్ ఆశించినప్పటికీ పరుగులు చెయ్యడంలో విఫలం అయ్యాడు కోహ్లీ. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు 217 పరుగులు మాత్రమే చేయగా.. అందులో కోహ్లీ 44 పరుగులు మాత్రమే చెయ్యగలిగారు. రెండవ ఇన్నింగ్స్‌లో, జట్టు పెద్ద స్కోరు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, కేవలం 13 పరుగులకే అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 170పరుగులకే అవుట్ అయ్యింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ కోహ్లీ చేసింది 57 పరుగులే. మరోవైపు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ మాత్రం మొదటి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 53 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందిండంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసింది టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర్ పూజారా నుంచే.. ఈ మ్యాచ్‌లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చేతేశ్వర్ పుజారా నుంచి చాలా ఆశించినా, కానీ అతను ఎక్కువగా నిరాశపరిచాడు. భారత్‌కు కష్ట సమయాల్లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 8 పరుగులు.. రెండవ ఇన్నింగ్స్‌లో 15 పరుగులు మాత్రమే చేశాడు.


ఈ మ్యాచ్‌లో, భారత ఫాస్ట్ బౌలింగ్ దాడిలో అందరి కళ్ళు బుమ్రాపైనే ఉన్నాయి. వెటరన్ సీనియర్లు అత్యంత ముఖ్యమైన బౌలింగ్‌గా అభివర్ణించిన జస్‌ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చినా వికెట్లు తీయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 10.4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 35 పరుగులు ఇవ్వగా ఒక్క వికెట్ తీయలేకపోయారు. ఇక యంగ్ క్రికెటర్ షుబ్మాన్ గిల్ కూడా అనుకున్న రీతిలో న్యాయం చేయలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో 28పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 8పరుగులు మాత్రమే చెయ్యగలిగాడు. భారత్ ఓటమిలో ఈ నలుగురి పాత్ర ముఖ్యంగా చెప్పుకొవచ్చు అంటున్నారు నిపుణులు.