Shashi Tharoor: సర్‌ప్రైజ్ ఇచ్చారు.. రహానె, శార్దూల్ ఆటతీరుపై శశి థరూర్ ఏమన్నారంటే?

ఈ మ్యాచ్ గురించి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ లండన్ లోని ఓవల్ లో మాట్లాడారు.

Shashi Tharoor: సర్‌ప్రైజ్ ఇచ్చారు.. రహానె, శార్దూల్ ఆటతీరుపై శశి థరూర్ ఏమన్నారంటే?

PIC: @BCCI

Shashi Tharoor – WTC 2023 Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా (Team India) తొలి రెండు రోజులు తడబడింది. ఇవాళ మాత్రం రహానె, శార్దూల్ ఠాకూర్ అద్భుత ఆటతీరుతో కాస్త మెరుగుపడింది. టీమిండియా ఓడిపోతుందనుకున్న ఈ మ్యాచులో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆస్ట్రేలియా(Australia)లోని ఓవల్‌ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది.

ఈ మ్యాచ్ గురించి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ లండన్ లోని ఓవల్ లో మాట్లాడారు. ” ఇవాళ సర్‌ప్రైజ్ ఇచ్చారు. నిన్న చాలా నిరాశ చెందాం. శార్దూల్ ఠాకూర్ చాలా పరిణితితో బ్యాటింగ్ చేశాడు.

రహానె, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ తీరుతో ఆస్ట్రేలియాతో పోరాడే అవకాశం మళ్లీ వచ్చింది. నిన్నటి వరకు ఆస్ట్రేలియానే విజయం వరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం హోరాహోరీ తలపడొచ్చని స్పష్టమవుతోంది” అని చెప్పారు.

కాగా, ఈ మ్యాచులో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్ లో 173 పరుగుల ఆధిక్యం దక్కింది.

WTC Final 2023: టీమ్ ఇండియా 296 ఆలౌట్‌.. ఆసీస్‌కు 173 ర‌న్స్ ఆధిక్యం