Home » killed
యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో రష్యాకు చెందిన 63 మంది సైనికులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా కూడా ధృవీకరించింది.
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రీలో ఆదివారం ఇద్దరు సాయుధులు పౌరులపై కాల్పులు జరిపారు.
కడప జిల్లా బద్వేల్ లో బాలుడు మిస్సింగ్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం బాలుడి ప్రాణం తీసింది. తల్లి, ప్రియుడే బాలుడిని చంపేశారని తేలింది.
బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. అనేక మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందారు. మంగళవారం బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో దారుణం జరిగింది. అతిగా ఫోన్ మాట్లాడుతుందని ఓ వ్యక్తి కన్న కూతురునే హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన సంఘటన మరువక ముందే రాజస్తాన్ లో ఇలాంటి ఘోర ఘటనే చోటు చేసుకుంది. జైపూర్ లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మేనత్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి అడవిలో పడేశాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. కోటి రూపాయల కోసం ఓ విద్యార్థిని వ్యక్తి హత్య చేశాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న పీహెచ్ డీ విద్యార్థిని యజమాని చంపి మూడు ముక్కులుగా చేసి కాలువలో పడేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం రేపాయి. క్వీన్స్ లాండ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి చెందారు. కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని వెతికేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.