63 Russian Soldiers Killed : యుక్రెయిన్ రాకెట్ దాడి.. 63 మంది రష్యా సైనికులు మృతి

యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో రష్యాకు చెందిన 63 మంది సైనికులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా కూడా ధృవీకరించింది.

63 Russian Soldiers Killed : యుక్రెయిన్ రాకెట్ దాడి.. 63 మంది రష్యా సైనికులు మృతి

ROCKET ATTACK

Updated On : January 3, 2023 / 2:03 PM IST

63 Russian Soldiers Killed : రష్యా, యుక్రెయిన్ మధ్యం కొనసాగుతూనేవుంది. యుక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో రష్యాకు చెందిన 63 మంది సైనికులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా కూడా ధృవీకరించింది. ఈశాన్య డోనెట్స్ ప్రాంతంలోని రష్యా సైనిక బలగాల క్యాంపు లక్ష్యంగా అమెరికా సరఫరా చేసిన ఆరు రాకెట్లను యుక్రెయిన్ ప్రయోగించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది.

వీటిలో రెండు రాకెట్లను కూల్చి వేశామని చెప్పింది. యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో తమ సైనికులు 63 మంది మృతి చెందారని రష్యా ప్రకటించింది. కాగా, తమ దాడిలో 400 మంది రష్యా సైనికులు మృతి చెందారని, మరో 300 మంది గాయపడ్డారని యుక్రెయిన్ వెల్లడించింది.

Russia Ukraine War: రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడేం జరుగుతుంది

మరోవైపు యుక్రెయిన్ రాజధాని కీవ్ లోని విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేసే లక్ష్యంతో రష్యా ప్రయోగించిన 40 డ్రోన్లను తమ వాయుసేన కూల్చి వేసిందని యుక్రెయిన్ పేర్కొంది. కాగా, సరిహద్దులోని తమ గ్రామంపై కూడా యుక్రెయిన్ డ్రోన్ తో దాడి చేసిందని రష్యా ఆరోపించడం గమనార్హం.