Terrorists Firing : జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు పౌరులు మృతి

జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రీలో ఆదివారం ఇద్దరు సాయుధులు పౌరులపై కాల్పులు జరిపారు.

Terrorists Firing : జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు పౌరులు మృతి

TERRORISTS

Updated On : January 2, 2023 / 9:36 AM IST

Terrorists Firing : జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. రాజౌరీలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు. మరో 10 తొమ్మిది మంది గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రీలో ఆదివారం ఇద్దరు సాయుధులు గ్రామస్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.

మూడు ఇళ్లపై కాల్పులు జరిగాయని, ఘటనాస్థలంలో ఇద్దరు పౌరులు మరణించగా మరో నలుగురు తీవ్రంగా  గాయపడ్డారని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ చెప్పారు. కాల్పులకు పాల్పడిన వారు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

బాధితులను దీపక్ కుమార్, సతీష్ కుమార్, ప్రీతమ్ లాల్ గా గుర్తించారు. తుపాకీ గాయాలతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పది మంది గాయపడినట్లు రాజౌరి మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరు ఆసుపత్రిలో మరణించారని చెప్పారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

తాము వారి ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. గత రెండు వారాల్లో జిల్లాలో పౌర హత్యలు జరగడం ఇది రెండోసారి. డిసెంబరు 16న రాజౌరిలోని సైనిక శిబిరం బయట ఇద్దరు పౌరులు మరణించారు.