Home » Matti Manishi
కంది పంటను శాకీయ దశలో , పూత సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కాయతొలిచే పురుగులు అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి.
గత నాలుగైదు ఏళ్ళుగా కొబ్బరి చెట్లకు నల్లి తెగుళ్ళతో పాటు ఇతర చీడపీడలు ఆశించడం కొబ్బరి పరిశ్రమ మీద ఆధారపడ్డ రైతులు , వ్యాపారులు కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజు పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అ�
పశుపోషణ అనాదిగా రైతు జీవన వృత్తిలో భాగం. వ్యవసాయ పనుల్లో రైతుకు తోడ్పాటును అందించటంతోపాటు, పాడి ద్వారా రైతుకు నిత్యం ఆదాయాన్ని అందించే ఏకైక రంగం పశుపోషణ. డెయిరీ ద్వారా వచ్చే ఎరువువల్ల వ్యవసాయంలో కలిగే ప్రయోజనాలు అనేకం.
నాలుగో సంవత్సరం నుంచి ఖర్జూర చెట్లు కాపునకు వస్తాయి. ఫిబ్రవరి రెండో పక్షం నుంచి మార్చి మొదటి పక్షంలోనే పూత వస్తుంది. పూత వచ్చే నెల రోజులు ముందుగా నీటి తడులు ఆపేస్తే వాడుకు వచ్చి.. మంచి పూత, పిందె పడుతుంది.
ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలుకు చాలా వరకు వరినారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి.
టమాట సాగులో నీటి యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం . భూమిలో తేమను బట్టి నీటితడులు అందించాలి. ఎరువులను వాడటం వలన ఉత్పత్తి పెరుగుంతుంది. కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అంతే కాదు టమాటలో కలుపు యాజమాన్యం కూడా కీలకం.
పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు.
మిరప సాగయ్యే ప్రధాన పొలంలో గత సీజన్ కు సంబంధించిన శిలీంధ్ర బీజాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆఖరి దుక్కుల చేసేటప్పుడు ట్రైకోడర్మావిరిడి వేసుకోవాలి. లేదంటే ఈ మొక్కలను ఆశించి పంట నష్టం జరుగుతుంది.
కాకర అనగానే అందరికీ చేదే గుర్తుకొస్తుంది. కానీ పందిరి జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు, స్థిరమైన మార్కెట్ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది.
మునగ మొక్క తోటను నరికిన తర్వాత, ఆ మోళ్ల నుండి వచ్చే పిలకల ద్వారా ఇంకో పంటను తీసుకుంటారు. దీన్ని కార్శి లేదా మోడెం పంట అంటారు. జూన్ , జులై నెలల్లో మునగను నరికిన తర్వాత రైతులు కార్శి తోటల నిర్వహణపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.