Home » Skill Development case
గతంలో అమరావతి భూముల కేసును కూడా లూథ్రానే వాదించారు. అదేవిధంగా చంద్రబాబు ఇతర కేసులనూ సిద్ధార్థ్ లూథ్రా చూస్తున్నారు. వివేకా హత్య కేసులోనూ సునీత తరపున వాదనలు సిద్ధార్థ్ లూథ్రా వినిపించారు.
చంద్రబాబు ఏం చేసినా చట్టపరిధిలోకిరాదన్న ఆలోచన మానుకోవాలని, ఐపీసీ రాసేటప్పుడు చంద్రబాబుకు వర్తించదని రాయలేదని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు.
చంద్రబాబు అరెస్టుపై న్యాయవాదులతో లోకేశ్ సమీక్షించారు. చంద్రబాబును పోలీసులు ఎక్కడికి తీసుకొస్తే అక్కడికి వెళ్లే యోచనలో లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది.
‘మేము చంద్రబాబుకు మద్దతు’ అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నినదిస్తుండగా.. ‘కరప్షన్ కింగ్ చంద్రబాబు’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.
చంద్రబాబును గిద్దలూరు, మార్కాపురం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఆయనను హెలికాప్టరులో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం కావడంతో.. రోడ్డు మార్గంలోనే తీసుకెళ్తున్నారు
జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని.. అతని లాగే అందర్నీ జైలుకు పంపించాలని ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు వందల మంది టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారని, ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.
పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు వద్దకు వెళ్లొద్దంటూ లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుంచి పోలీసులు హై డ్రామా కొనసాగిస్తున్నారు
2015లో స్కిల్ డెవలప్మెంట్- సీమెన్స్ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,356 కోట్ల రూపాయలు
స్కిల్ డెవలెప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు సిట్ ముందు హాజరుపర్చారు.