Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టైన కేసులోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్

జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని.. అతని లాగే అందర్నీ జైలుకు పంపించాలని ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టైన కేసులోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్

Updated On : September 9, 2023 / 9:00 AM IST

AP Politics: మాజీ మంత్రి, త్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎండాడ వద్ద ఉన్న దిశా పోలీస్ స్టేషన్ లో గంటాను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం గంటా మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. దేశరాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. అర్థరాత్రి హైడ్రామా చేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆనందం కోసం మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.

Chandrababu Arrest: ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డు మీద హత్య చేశారు.. అరెస్ట్ అనంతరం చంద్రబాబు

జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళారని అక్కసుతో, చంద్రబాబును అరెస్ట్ చేయించినట్టు ఉందని గంటా అన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని.. అతని లాగే అందర్నీ జైలుకు పంపించాలని ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు. నియంత సీఎం జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అమరావతి భూముల విషయంపై మొదటిసారి తన పేరు కూడా చేర్చారన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని గంటా తెలిపారు.