Chandrababu Arrest: పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు.. చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి
చంద్రబాబును గిద్దలూరు, మార్కాపురం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఆయనను హెలికాప్టరులో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం కావడంతో.. రోడ్డు మార్గంలోనే తీసుకెళ్తున్నారు

AP Politics: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, అయినా ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఆయనను సరైన నోటీసు లేకుండా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. వివరణ తీసుకోకుండా, విధానాలను అనుసరించకుండా అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు.
AP Politics: చంద్రబాబు మీద పెట్టిన కేసులేంటి? ఇంతకీ ఆయన అరెస్టుకు కారణమేంటి?
ఇక చంద్రబాబును గిద్దలూరు, మార్కాపురం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఆయనను హెలికాప్టరులో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం కావడంతో.. రోడ్డు మార్గంలోనే తీసుకెళ్తున్నారు. నంద్యాల నుంచి విజయవాడ వరకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు వాహనాలకు ఎక్కడా అడ్డురాకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టైన కేసులోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్
ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తారని తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ యువ నేత లోకేశ్ మాట్లాడుతూ, పిచ్చోడు లండన్‌కి, మంచోడు జైలుకి అని అన్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ మీద రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రోడ్ల మీదకు వచ్చిన నిరసన తెలుపుతున్నారు.