Chandrababu Naidu Arrest: తన వైపు ధర్మం ఉంది ఎవరికి ఆందోళన వద్దు.. కుటుంబ సభ్యులతో చంద్రబాబు.. Live Update

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు సిట్ ముందు హాజరుపర్చారు.

Chandrababu Naidu Arrest: తన వైపు ధర్మం ఉంది ఎవరికి ఆందోళన వద్దు.. కుటుంబ సభ్యులతో చంద్రబాబు.. Live Update

Chandra babu Arrest

Updated On : September 10, 2023 / 1:01 AM IST

Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు ఉదయం నంద్యాలలో అరెస్టు చేశారు. ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో అమరావతికి చంద్రబాబును తీసుకొస్తున్నారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 10 Sep 2023 12:08 AM (IST)

    చంద్రబాబుకు బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటిషన్

    చంద్రబాబుకు బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. డిలే ఆఫ్ ప్రొడ్యూస్ లో భాగంగా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ హౌస్ మోహషన్ పిటిషన్ వేసేందుకు చంద్రబాబు తరపు లాయర్లు సిద్ధమయ్యారు. చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టేందుకు రేపు ఉదయం 6 గంటల వరకు అవకాశం ఉంది.

  • 09 Sep 2023 11:59 PM (IST)

    చంద్రబాబుకు 20 ప్రశ్నలు సంధించిన సీఐడీ అధికారులు

    స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. చంద్రబాబుకు సీఐడీ అధికారులు 20 ప్రశ్నలు సంధించారు. సీఐడీ అధికారులు చంద్రబాబు సమాధానాలను రికార్డు చేశారు. వైద్య పరీక్షల తర్వాత చంద్రబాబును సీఐడీ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనుంది. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర చంద్రబాబు తరపున వాదించనున్నారు. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్, వివేకానంద వాదనలు వినిపించనున్నారు.

  • 09 Sep 2023 10:11 PM (IST)

    సిట్ కార్యాలయంలో చంద్రబాబుకు కుటుంబ సభ్యుల్ని కల్పించిన సీఐడీ

    సిట్ కార్యాలయంలో 2గంటలు వేచి ఉన్న తర్వాత సీఐడీ కుటుంబ సభ్యుల్ని చంద్రబాబుకు కల్పించింది. చంద్రబాబుని కలిసి లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మిణి, బాలకృష్ణ మాట్లాడారు. తన వైపు ధర్మo ఉందని ఎవరికి ఎలాంటి ఆందోళన వద్దని కుటుంబ సభ్యులతో చంద్రబాబు అన్నారు. కుట్ర రాజకీయాలను ధీటుగానే అందరి సహకారంతో ఎదుర్కొంటానని చంద్రబాబు చెప్పారు. కుటుంబ సభ్యులు చంద్రబాబు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుని కుటుంబ సభ్యులు కలిసి సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

  • 09 Sep 2023 09:35 PM (IST)

    విచారణ అనంతరం చంద్రబాబును జీజీహెచ్ కు సీఐడీ అధికారులు తరలించనున్నారు. వైద్య పరీక్షల తరువాత ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చనున్నారు.

  • 09 Sep 2023 09:33 PM (IST)

    చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన పట్ల రాజకీయ కక్షతో దుర్మార్గంగా వ్యవహరించారని తుమ్మల మండిపడ్డారు.

  • 09 Sep 2023 08:56 PM (IST)

    బాలకృష్ణను అనుమతించని అధికారులు..

    హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బాలకృష్ణ, నారా బ్రాహ్మణి గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సిట్ కార్యాలయానికి వెళ్లారు. అయితే, సిట్ కార్యాలయంలో చంద్రబాబును కలిసేందుకు బాలకృష్ణ, బ్రాహ్మణిలను అధికారులు అనుమతించలేదు.

  • 09 Sep 2023 08:46 PM (IST)

    రాత్రంతా విచారించే అవకాశం

    టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు రాత్రంతా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన 24గంటలు ముగిసేలోపు అంటే రేపు ఉదయం 5గంటలకు జడ్జి ఎదుట చంద్రబాబును హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు సమచారం.

  • 09 Sep 2023 08:37 PM (IST)

    సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

    సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయం వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు పంపించి వేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

  • 09 Sep 2023 08:28 PM (IST)

    చంద్రబాబు నాయుడు సిట్ అధికారుల విచారణకు సహకరించడం లేదని సీఐడీ అధికారులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ చాటింగ్ పై చంద్రబాబు మౌనంగా ఉండిపోయారని సమాచారం.

  • 09 Sep 2023 08:16 PM (IST)

    చంద్రబాబు విచారణ సిట్ కార్యాలయంలో కొనసాగుతుంది. రెండు గంటలకుపైగా సీఐడీ అధికారులు చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారిస్తున్నారు. చంద్రబాబుకు 20 ప్రశ్నలను అధికారులు సంధించారు.

  • 09 Sep 2023 08:10 PM (IST)

    చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఆదివారం (రేపు) ఉదయం 9.54 గంటలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో 11 మంది టీడీపీ బృందం విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.

  • 09 Sep 2023 07:34 PM (IST)

    - స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ అధికారుల ప్రశ్నల వర్షం.
    - రెండు గంటలకుపైగా విచారిస్తున్న సీఐడీ అధికారులు
    - చంద్రబాబు చెప్పే సమాధానాలను రికార్డ్ చేస్తున్న అధికారులు.
    - ఐదవ ఫ్లోర్‌లో ఉన్న చంద్రబాబు
    - చంద్రబాబును కలిసేందుకు సిట్ కార్యాలయంకు వెళ్లిన నారా భువనేశ్వరి, లోకేశ్
    - నాల్గో ఫ్లోర్ లో కూర్చోబెట్టిన అధికారులు
    - రిమాండ్ రిపోర్టు తయారు చేయడంలో జాప్యం
    - ఇప్పటికీ చంద్రబాబు అడ్వకేట్లను లోపలికి అనుమతించని అధికారులు

  • 09 Sep 2023 07:08 PM (IST)

    గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు..

    విశాఖ పట్టణంలోని విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ లో ఉన్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసేందుకు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో గవర్నర్ ను వీరు కలవనున్నారు. గవర్నర్ ను కలిసేందుకు టీడీపీ నేతలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, బండారు, పల్లాకు అనుమతి లభించింది.

  • 09 Sep 2023 07:05 PM (IST)

    బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బాలకృష్ణ, నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి విజయవాడ బయలుదేరారు.

  • 09 Sep 2023 07:03 PM (IST)

    చంద్రబాబుపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు కుంచనపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉన్న చంద్రబాబును కలిసేందుకు సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్ అక్కడికి చేరుకున్నారు.

  • 09 Sep 2023 06:55 PM (IST)

    సీఐడీ అధికారులకు చంద్రబాబు లేఖ..

    చంద్రబాబు తరపు న్యాయవాదులను కుంచనపల్లి సిట్ కార్యాలయంలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో సీఐడీ చీఫ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. తన లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం. లక్ష్మీనారాయణ, శరత్ చంద్రను కలిసేందుకు అనుమతించాలని లేఖలో పేర్కొన్నారు.

    Chandrababu letter to CID officials

    Chandrababu letter to CID officials

  • 09 Sep 2023 06:39 PM (IST)

     

  • 09 Sep 2023 06:08 PM (IST)

    సిట్ కార్యాలయంలోకి చంద్రబాబు చేరుకున్నారు. అయితే, కేవలం ప్రభుత్వ అడ్వకేట్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ప్రైవేట్ అడ్వకేట్లను అనుమతించని పోలీసులు. పోలీసుల తీరుపై అడ్వకేట్ల తీవ్ర అభ్యంతరం. ఏ నిబంధనల ప్రకారం అడ్డుకున్నారో చెప్పాలంటూ ప్రశ్నించిన అడ్వకేట్లు. గంటకుపైగా సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారించనున్న సీఐడీ.

  • 09 Sep 2023 05:59 PM (IST)

    టీడీపీ అధినేత చంద్రబాబు తరపున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు. కాసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ పిటీషన్ పై వాదనలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు తరపున వాదనలు వినిపించేందుకు కోర్టు కాంప్లెక్స్ కు లూథ్రా చేరుకున్నారు.

  • 09 Sep 2023 05:03 PM (IST)

    విజయవాడ వద్ద కుంచనపల్లి సిట్ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్. దాదాపు తొమ్మిది గంటలపాటు కాన్వాయ్ లోనే ప్రయాణం చేసిన చంద్రబాబు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించనున్న పోలీసులు.

  • 09 Sep 2023 04:57 PM (IST)

    ఏఏజీ సుధాకర్ రెడ్డికి చంద్రబాబు కేసు అంశాలు వివరిస్తున్న సీఐడీ. చంద్రబాబును జ్యుడిషియల్ కస్టడీకి కోరనున్న ఏఏజీ.

  • 09 Sep 2023 04:55 PM (IST)

    చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న సిద్ధార్థ లూథ్ర. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న లూథ్ర.

  • 09 Sep 2023 04:52 PM (IST)

    తాడేపల్లికి చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్.. హైవేపై చంద్రబాబు వెంట భారీ ర్యాలీగా వస్తున్న టీడీపీ కార్యకర్తలు. హైవేపై భారీగా స్తంభించిన ట్రాఫిక్. లాఠీఛార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు.

  • 09 Sep 2023 04:40 PM (IST)

    చంద్రబాబును కలిసేందుకు కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి

    కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవ్వరికీ చంద్రబాబును కలిసేందుకు అనుమతిలేదని పోలీసులు పేర్కొంటున్నారు. భువనేశ్వరి, లోకేశ్‌ను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పినట్లు సమాచారం.

  • 09 Sep 2023 04:37 PM (IST)

    గన్నవరంలో పవన్ ప్రత్యేక విమానానికి పోలీసులు అనుమతి నిరాకరణ. పవన్ ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చిన పోలీసులు. చంద్రబాబును కలిసేందుకు పవన్ కు అనుమతిలేదంటున్న పోలీసులు.

  • 09 Sep 2023 04:09 PM (IST)

    చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గుంటూరు వై జంక్షన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో వై జంక్షన్ వద్ద పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. పోలీసుల పటిష్ట భద్రత నడుమ చంద్రబాబు కాన్వాయ్ వైజంక్షన్ దాటింది.

  • 09 Sep 2023 04:07 PM (IST)

    కాసేపట్లో కుంచనపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును పోలీసులు తరలించనున్నారు. చంద్రబాబు కాన్వాయ్ చిలకలూరిపేట దాటింది.

  • 09 Sep 2023 04:04 PM (IST)

    విజయవాడ సిటీ కోర్టు కాంప్లెక్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ మహిళా కార్యకర్తలు భారీగా చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 09 Sep 2023 03:24 PM (IST)

    మరికాసేపట్లో అమరావతికి చంద్రబాబు ..

    మరికొద్దిసేపట్లో చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ అమరావతికి చేరుకోనుంది. సీఐడీ అధికారులు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకురానున్నారు.

  • 09 Sep 2023 02:52 PM (IST)

    దారి ఇవ్వాలంటూ కార్యకర్తలకు చంద్రబాబు విజ్ఞప్తి

    చిలకలూరి పేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. చంద్రబాబును తీసుకెళ్తున్న కాన్వాయ్ ను అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున మహిళలు బైఠాయించారు. దీంతో దాదాపు అరగంట నుంచి చంద్రబాబును తరలిస్తున్న పోలీసుల కాన్వాయ్ అక్కడే నిలిచిపోయింది. ఈ క్రమంలో వాహనం నుంచి దిగొచ్చిన చంద్రబాబు.. దారి ఇవ్వాలంటూ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

  • 09 Sep 2023 02:44 PM (IST)

    విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద భారీ బందోబస్తు

    విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబును విజయవాడ ఆస్పత్రికి తీసుకురానున్నట్లు తెలిసింది. అక్కడ వైద్య పరీక్షలకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ఆస్పత్రి వద్దకు వచ్చిన సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

  • 09 Sep 2023 02:40 PM (IST)

    చంద్రబాబు నాయుడును తరలిస్తున్న కాన్వాయ్ చిలకలూరి పేటకు చేరింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో విజయవాడకు చేరుకోనున్నారు. చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.

  • 09 Sep 2023 02:25 PM (IST)

    కనకదుర్గమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి..

    చంద్రబాబు నాయుడుకు మనోధైర్యం ఇవ్వాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుటుంబ సభ్యులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తన భర్తను రక్షించాలని దుర్గమ్మను కోరినట్లు తెలిపారు. చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల బాగుకోసం పోరాటం చేస్తున్నారని భువనేశ్వరి వివరించారు.

  • 09 Sep 2023 09:49 AM (IST)

    పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు.. చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి

    తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, అయినా ఆయనను ఎలా అరెస్ట్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఆయనను సరైన నోటీసు లేకుండా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. వివరణ తీసుకోకుండా, విధానాలను అనుసరించకుండా అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు.

  • 09 Sep 2023 09:06 AM (IST)

    చంద్రబాబు అరెస్టుపై రాష్ట్రంలో అట్టుడుకుతున్న నిరసనలు

    తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ మీద రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు రోడ్ల మీదకు వచ్చిన నిరసన తెలుపుతున్నారు.

  • 09 Sep 2023 08:58 AM (IST)

    స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్

    మాజీ మంత్రి, త్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎండాడ వద్ద ఉన్న దిశా పోలీస్ స్టేషన్ లో గంటాను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం గంటా మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. దేశరాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. అర్థరాత్రి హైడ్రామా చేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆనందం కోసం మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.

    జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళారని అక్కసుతో, చంద్రబాబును అరెస్ట్ చేయించినట్టు ఉందని గంటా అన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని.. అతని లాగే అందర్నీ జైలుకు పంపించాలని ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారన్నారు. నియంత సీఎం జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అమరావతి భూముల విషయంపై మొదటిసారి తన పేరు కూడా చేర్చారన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని గంటా తెలిపారు.

  • 09 Sep 2023 08:50 AM (IST)

    చంద్రబాబును గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు తరలించనున్న పోలీసులు

    టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును గిద్దలూరు, మార్కాపురం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఆయనను హెలికాప్టరులో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం కావడంతో.. రోడ్డు మార్గంలోనే తీసుకెళ్తున్నారు. నంద్యాల నుంచి విజయవాడ వరకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు వాహనాలకు ఎక్కడా అడ్డురాకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం

  • 09 Sep 2023 08:50 AM (IST)

    చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో బస్సుల బంద్

    చంద్రబాబు అరెస్ట్ నేపధ్యంలో బస్సులు బంద్ పెట్టారు. ఆర్టీసి డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. ముందస్తుగా బస్సులు నిలిపివేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. అయితే బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

  • 09 Sep 2023 08:48 AM (IST)

    చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో అప్రమత్తం ప్రకటించిన పోలీసులు

    చంద్రబాబు ఫారెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి చెందిన పులువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులపై పోలీసుల నిఘా పెంచారు. టీడీపీ సానుభూతిపరుల పైన నిఘా పేట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అలెర్ట్ ప్రకటించారు.

  • 09 Sep 2023 08:10 AM (IST)

    రోడ్డు మార్గంలో చంద్రబాబును విజయవాడ తరలిస్తున్న పోలీసులు

    టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రోడ్డు మార్గంలో విజయవాడ తరలిస్తున్నారు పోలీసులు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన ఆయనను హెలికాప్టరులో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం కావడంతో.. రోడ్డు మార్గంలోనే తీసుకెళ్తున్నారు. నంద్యాల నుంచి విజయవాడ వరకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు వాహనాలకు ఎక్కడా అడ్డురాకుండా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం

  • 09 Sep 2023 08:07 AM (IST)

    నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హౌస్ అరెస్ట్

    మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కారణంగా గొడవలు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు టీడీపీ నేతలను నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • 09 Sep 2023 08:06 AM (IST)

  • 09 Sep 2023 07:58 AM (IST)

    చంద్రబాబును విమానాశ్రయానికి తీసుకెళ్లే యత్నం

    చంద్రబాబును అరెస్ట్ చేసి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్ళాలని పోలీసులు యత్నిస్తున్నారు. అక్కడ హెలికాప్టర్‌ను పోలీసులు సిద్ధంగా ఉంచారు. అక్కడి నుంచి విజయవాడకి తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైళ్ళను పోలీసులు నంద్యాల తీసుకువెళ్లారు. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొంతమందికి కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఇదే కేసులో ఒక ఆడిటర్‌ను సీఐడీ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో ఏదైనా స్టేట్‌మెంట్ ఇపపించారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • 09 Sep 2023 07:49 AM (IST)

    ఏదేమైనా న్యాయం గెలుస్తుంది-చంద్రబాబు

    తాను ప్రజాసమస్యలపై పోరాడుతున్నానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు వందల మంది టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారని, ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అణచివేయాలని చూస్తోందని అన్నారు.

  • 09 Sep 2023 07:37 AM (IST)

  • 09 Sep 2023 07:34 AM (IST)

    చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న పోలీసులు

    స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. నంద్యాలలో అరెస్ట్ అనంతరం విజయవాడకు తీసుకెళ్తున్నారు. అయితే విజయవాడలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

  • 09 Sep 2023 07:33 AM (IST)

    నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకుల హౌజ్ అరెస్ట్

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో కొందర్ని హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని టీడీపీ నాయకుల్ని హౌజ్ అరెస్ట్ చేశారు. మాగుంట లేఔట్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అల్లిపురంలో టిడిపి పొలిటి బ్యూరో సభ్యులు సోమిరెడ్డి, నెల్లూరులో ఎమ్మెల్యే ఆనం రానారాయణరెడ్డి, బాలాజీనగర్ లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరులో కోవూరు నియోజకవర్గఇంచార్జ్ దినేష్ రెడ్డిలను హౌజ్ అరెస్ట్ చేశారు.

  • 09 Sep 2023 07:31 AM (IST)

    పోలీసులకు లోకేష్‭కు మధ్య వాగ్వాదం.. పొదలాడలో హైడ్రామా

    పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు వద్దకు వెళ్లొద్దంటూ లోకేష్‭ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుంచి పోలీసులు హై డ్రామా కొనసాగిస్తున్నారు. నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని పోలీసులు చెబుతున్నారు. అలాగే లోకేష్ వద్దకు మీడియా కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. వస్తే అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు. అయితే తన తండ్రిని చూడడానికి వెళ్ళకూడదా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు లోకేష్. తన వెంట ఎవరూ రావడం లేదని, కుటుంబ సభ్యుడిగా తాను ఒక్కడినే వెళ్తానని, అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు. దీంతో క్యాంప్ సైట్ వద్ద బస్సు ముందే బైఠాయించి లోకేష్ నిరసన తెలుపుతున్నారు.

  • 09 Sep 2023 07:19 AM (IST)

    చంద్రబాబు అరెస్టు నైపథ్యంలో విజయవాడలో పోలీసుల అలర్ట్

    చంద్రబాబు నాయుడు అరెస్టు నైపథ్యంలో విజయవాడలో పోలీసుల అలర్ట్ అయ్యారు. టీడీపీ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అందరినీ హౌజ్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యమైన నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. జాతీయ రహదారులు సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ చెక్పోస్టులు పెట్టి పోలీస్ పహారా కాస్తున్నారు.

  • 09 Sep 2023 07:15 AM (IST)

    లోకేష్ బస చేసిన ఫంక్షన్ హాల్ వద్ద భారీగా పోలీసులు

    చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో లోకేష్ బస చేసిన ఫంక్షన్ హాల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఫంక్షన్ హాల్ చుట్టూ బారీకేడ్లు ఏర్పాటు చేసి, నేతలెవర్నీ లోపలికి అనుమతించడం లేదు. లోకేష్ ప్రస్తుతం రాజోలు నియోజకవర్గంలో ఉన్నారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

  • 09 Sep 2023 07:12 AM (IST)

    చంద్రబాబు తరపున పోలీసులతో వాదిస్తున్న న్యాయవాదులు

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై పోలీసులతో న్యాయవాదులు వాదిస్తున్నారు. అరెస్టుకు సంబంధించిన ఆధారాలు చూపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే హైకోర్టుకు ప్రాథమిక ఆధారలు ఇచ్చామని, రిమాండ్ రిపోర్టులో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇక అరెస్టుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇస్తామని, అందులో చూసుకోవచ్చంటూ సమాధానం చెప్తున్నారు.