Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు మీద తనయుడు లోకేష్ ఏమన్నారంటే?

పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు వద్దకు వెళ్లొద్దంటూ లోకేష్‭ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుంచి పోలీసులు హై డ్రామా కొనసాగిస్తున్నారు

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు మీద తనయుడు లోకేష్ ఏమన్నారంటే?

Updated On : September 9, 2023 / 8:34 AM IST

AP Politics: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ మీద తనయుడు నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నేరుగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి…ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం అంటూ విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లోకేష్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు.


పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు వద్దకు వెళ్లొద్దంటూ లోకేష్‭ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుంచి పోలీసులు హై డ్రామా కొనసాగిస్తున్నారు. నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని పోలీసులు చెబుతున్నారు. అలాగే లోకేష్ వద్దకు మీడియా కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. వస్తే అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు. అయితే తన తండ్రిని చూడడానికి వెళ్ళకూడదా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు లోకేష్.


తన వెంట ఎవరూ రావడం లేదని, కుటుంబ సభ్యుడిగా తాను ఒక్కడినే వెళ్తానని, అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ నిలదీశారు. దీంతో క్యాంప్ సైట్ వద్ద బస్సు ముందే బైఠాయించి లోకేష్ నిరసన తెలుపుతున్నారు. తన పాద‌యాత్ర‌పై వైకాపా రౌడీమూక‌ల‌తో ద‌గ్గ‌ర ఉండి రాళ్లు పోలీసులు రాళ్లు వేయించారని, యువ‌గ‌ళం వ‌లంటీర్ల‌పై ఎటాక్ జ‌రిగింద‌ని ఫిర్యాదులు ఇస్తే, రివ‌ర్స్ కేసులు వారిపైనే బ‌నాయించిన పోలీసులు తనకు ర‌క్ష‌ణ క‌ల్పిస్తార‌నడం సిగ్గు చేటని లోకేష్ అన్నారు.