Chandrababu: చంద్రబాబు మీద పెట్టిన కేసులేంటి? ఇంతకీ ఆయన అరెస్టుకు కారణమేంటి?
2015లో స్కిల్ డెవలప్‌మెంట్- సీమెన్స్ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,356 కోట్ల రూపాయలు

Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో శనివారం ఉదయం ఆరు గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu Naidu) అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ సర్వ్ చేశారు. ఇది సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరు మీద వచ్చింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు.
చంద్రబాబు బాబు మీద సెక్షన్ 166,167,120(B), 418, 420, 465, 466, 471, 201,109, 409, 109 R/W 34&37 IPC, 25 12, 13(2), R/W 13(1)(c)(D) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1998 కింద కేసు నమోదు చేశారు. నాన్‍బెయిలబుల్ వారెంట్‍పై కెసులు నమోదు చేశారు. అండర్ సెక్షన్ 50(1),(2) CRPC కింద సీఐడీ నోటీసులు ఇచ్చారు.
అసలేంటి కేసు?
2015లో స్కిల్ డెవలప్‌మెంట్- సీమెన్స్ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,356 కోట్ల రూపాయలు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం ఉంది. 371 కోట్ల రూపాయలు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చి నేపథ్యంలో.. వైపీసీ నేతృత్వంలోని ప్రభుత్వం 2020 ఆగస్టులో విచారణకు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిగింది. 2020 డిసెంబరు 10న విజిలెన్స్ విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ ప్రారంభించింది. 2021 డిసెంబర్ 9న ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.