Airtel Xstream Fiber : ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ నెలవారీ ప్లాన్లపై అదిరే ఆఫర్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఓటీటీ మరెన్నో బెనిఫిట్స్.. ఇదిగో లిస్ట్..!

Airtel Xstream Fiber Plans : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) ఎక్స్‌ట్రీమ్ పైబర్ నెలవారీ ప్లాన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ అందించే నెలవారీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం..

Airtel Xstream Fiber : ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ నెలవారీ ప్లాన్లపై అదిరే ఆఫర్.. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఓటీటీ మరెన్నో బెనిఫిట్స్.. ఇదిగో లిస్ట్..!

Airtel Xstream Fiber monthly plans offer unlimited calling, OTT bundle, and more

Airtel Xstream Fiber Plans : ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) ఎక్స్‌ట్రీమ్ పైబర్ నెలవారీ ప్లాన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎయిర్‌టెల్ అందించే నెలవారీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ (Airtel Xstream) ఫైబర్ నెలవారీ ప్లాన్లపై ఆఫర్లను అందిస్తోంది. 150Mbps కన్నా ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్, OTT బెనిఫిట్స్ అందిస్తోంది. మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అందించే కొన్ని నెలవారీ ప్లాన్‌లను ఓసారి లుక్కేయండి. అందులో మీకు నచ్చిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందించనుంది.

టెలికాం ఆపరేటర్ కనీసం 200Mbps స్పీడ్, OTT ఛానెల్‌లతో ఆప్షన్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లతో వివిధ డివైజ్‌ల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ స్పీడ్, గేమ్ ప్లే, స్ట్రీమింగ్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు. కొన్ని OTT బెనిఫిట్స్ అందించే నెట్‌ఫ్లిక్స్ (Netflix), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ HotStar), అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఇతర వాటితో సహా OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఫ్రీ యాక్సస్ అందించే కొన్ని ప్లాన్‌లను అందించనుంది. అందుబాటులో ఉన్న ఎయిర్‌టెల్ ఫైబర్ నెలవారీ ప్లాన్లను ఓసారి లుక్కేయండి.

Airtel Xstream Fiber monthly plans offer unlimited calling, OTT bundle, and more

Airtel Xstream Fiber monthly plans offer unlimited calling, OTT bundle, and more

Airtel Xstream నెలవారీ ప్లాన్‌లు ఇవే :

* రూ. 999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
ఈ ప్లాన్ గరిష్టంగా 200Mbps స్పీడ్ అందిస్తుంది. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్, OTT సబ్‌స్క్రిప్షన్‌లతో అందిస్తుంది. Airtel Xstream Premium, వీఐపీ సర్వీస్ (VIP Service), అపోలో 24|7కి సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్, వింక్ ప్రీమియంపై క్యాష్‌బ్యాక్ వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి.

* రూ. 1,099 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
ఈ ప్లాన్ ద్వారా అదనపు టీవీ బెనిఫిట్స్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్‌తో 200Mbps స్పీడ్ పొందవచ్చు. ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్ డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, విఐపి సర్వీస్, అపోలో 24|7కి సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్, వింక్ ప్రీమియంపై క్యాష్‌బ్యాక్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి.

* రూ. 1,498 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 300Mbps స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, విఐపి సర్వీస్, అపోలో 24|7కి సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్, వింక్ ప్రీమియంపై క్యాష్‌బ్యాక్ వంటి ఉచిత సబ్‌స్క్రిప్షన్ వంటి ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి.

Airtel Xstream Fiber monthly plans offer unlimited calling, OTT bundle, and more

Airtel Xstream Fiber monthly plans offer unlimited calling, OTT bundle, and more

* రూ. 1,599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
ఈ ప్లాన్ ప్రొఫెషనల్స్, ఎక్కువ ఇంటర్నెట్ వినియోగించేవారికి బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్‌తో అదనపు టీవీ బెనిఫిట్స్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 300Mbps స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. Airtel Thanks యాప్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, VIP సర్వీస్, అపోలో 24|7కి సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్, వింక్ ప్రీమియంపై క్యాష్‌బ్యాక్ ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

* రూ. 3,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :
ఈ ప్యాకేజీలో అన్నీ కావాలనుకునే వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. గరిష్టంగా 1Gbps స్పీడ్, అన్‌లిమిటెడ్ కాలింగ్, Airtel థాంక్స్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం, వీఐపీ సర్వీస్, అపోలో 24|7కి సబ్‌స్క్రిప్షన్, ఫాస్ట్‌ట్యాగ్, వింక్ ప్రీమియంపై క్యాష్‌బ్యాక్ ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel Monthly Plans : ఎయిర్‌టెల్‌.. మీ సెకండరీ నంబర్‌గా వాడుతున్నారా? ఈ నెలవారీ ప్లాన్లు మీకోసమే.. ఓసారి చెక్ చేసుకోండి!