iOS 15.4 Beta : ఆపిల్ యూజర్లకు పండగే.. మాస్క్‌తోనే అన్‌లాక్ చేయొచ్చు.. సరికొత్త ఫీచర్ ఇదిగో..!

మీరు ఆపిల్ ఐఫోన్ యూజర్లా? అయితే మీకో గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాం సహా ఎెందులోనూ లేని సరికొత్త ఫీచర్ ఒకటి తీసుకొచ్చింది ఆపిల్ కంపెనీ.

iOS 15.4 Beta : ఆపిల్ యూజర్లకు పండగే.. మాస్క్‌తోనే అన్‌లాక్ చేయొచ్చు.. సరికొత్త ఫీచర్ ఇదిగో..!

Face Id Unlocking With A Ma

Face ID Unlocking With a Mask : మీరు ఆపిల్ ఐఫోన్ యూజర్లా? అయితే మీకో గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాం సహా ఎెందులోనూ లేని సరికొత్త ఫీచర్ ఒకటి తీసుకొచ్చింది ఆపిల్ కంపెనీ. ఈ ఫీచర్ మీ ఐఫోన్లో ఉంటే.. మాస్క్ తీయకుండానే మీ ఐఫోన్ అన్‌లాక్ చేసేయొచ్చు.. ఆపిల్ తమ iOS Beta (iOS 15.4) బీటా వెర్షన్‌‌లో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. అంతేకాదు.. iPadOS 15.4, macOS 12.3 వెర్షన్లను కూడా రిలీజ్ చేసింది ఆపిల్. Face ID Unlock విషయంలో ఇబ్బంది పడుతున్న ఐఫోన్ యూజర్లకు iOS 15.4 Beta ఫీచర్ ద్వారా పరిష్కారం దొరికినట్టే..

ఈ సరికొత్త ఫీచర్ మీ ఐఫోన్లో యాడ్ కావాలంటే.. మీరు ప్రస్తుత ఐఫోన్ వెర్షన్ నుంచి iOS 15.4 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ సరికొత్త (Face ID Unlock) ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు ముఖంపై ధరించిన మాస్క్ తీయకుండానే ఐఫోన్‌ను సులభంగా అన్‌లాక్ చేయవచ్చు. Cupertino దిగ్గజమైన ఆపిల్ ప్రస్తుత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసింది. 2020లో కరోనావైరస్ ప్రారంభం నుంచి మాస్క్ తప్పనిసరిగా మారింది. మిగతా ఫోన్లలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఐఫోన్ యూజర్లు మాత్రం తమ ఐఫోన్ అన్‌లాక్ చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఫేస్ మాస్క్ ధరించి ఫోన్ అన్ లాక్ చేయలేని పరిస్థితి..

ఈ సమస్యను అధిగమించేందుకు ఆపిల్ ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐప్యాడ్, మ్యాక్ డివైజ్ వినియోగించే ఆపిల్ యూజర్లు ఎవరైనా సరే ఈజీగా యాక్సస్ చేసుకునేలా యూనివర్శల్ కంట్రోల్ తీసుకొచ్చింది. Facial Recognition technology ద్వారా Face IDని మాస్క్ ధరించే అన్ లాక్ చేసుకోవచ్చు. మొన్నటివరకూ ఐఫోన్లు యూజర్లు మాస్క్ ధరించి ఫేస్ ఐడీ అన్ లాక్ చేయాలంటే.. పాస్ కోడ్ (Passcode) ద్వారా Unlock చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆ ఫీచర్ ద్వారా ఆపిల్ యూజర్లు ఫోన్ అన్ లాక్ చేసుకునేవారు.. ఆపై ఆపిల్ వాచ్ లోనూ ఈ తరహా ఫీచర్ ఒకటి తీసుకొచ్చింది. ఆపిల్ వాచ్ ద్వారా కూడా మీ ఐఫోన్ అన్ లాక్ చేసే ఫీచర్ ప్రవేశపెట్టింది.

ఇకపై Passcode, Apple watch అవసరం లేకుండానే సులభంగా ఆపిల్ డివైజ్ అన్ లాక్ చేసుకోవచ్చు. అది కూడా మాస్క్ ధరించి ఉండగానే ఫోన్ అన్ లాక్ చేసేస్తుంది ఈ కొత్త ఫీచర్ టెక్నాలజీ.. ఇంతకీ మాస్క్ ధరించినా ఎలా అన్ లాక్ చేస్తుందంటే.. మాస్క్ ధరించిన యూజర్ కళ్ల భాగంలో స్కాన్ చేయాల్సి ఉంటుంది. కళ్ల ద్వారా ఫోన్ Face ID అన్‌లాక్ చేసేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఆపిల్ యూజర్ అయితే వెంటనే మీ ఆపిల్ డివైజ్‌ను iOS 15.4 Beta వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసేయండి..

Read Also : UP Election 2022 : నా హెలికాప్టర్‌‌ను ఎందుకు అనుమతించలేదు.. కుట్ర దాగి ఉంది