FM Radio Mobiles : అన్ని మొబైల్ ఫోన్లలో FM రేడియో తప్పనిసరిగా ఉండాల్సిందే.. ఫోన్ మేకర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. ఎందుకో తెలుసా?

FM Radio Mobiles : ఐటీ మంత్రిత్వ శాఖ ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MAIT)లకు అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో మొబైల్ ఫోన్లలో FM రేడియో అందుబాటులో ఉండేలా అడ్వైజరీ జారీ చేసింది.

FM Radio Mobiles : అన్ని మొబైల్ ఫోన్లలో FM రేడియో తప్పనిసరిగా ఉండాల్సిందే.. ఫోన్ మేకర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. ఎందుకో తెలుసా?

FM Radio must be present and enabled on all mobile phones, government advisory warns

FM Radio Mobiles : భారత మార్కెట్లోకి రిలీజ్ అయ్యే అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఇకపై ఎఫ్ఎం (FM Radio) రేడియో ఫీచర్ డిఫాల్ట్‌గా తప్పక ఉండాల్సిందే.. స్మార్ట్‌ఫోన్‌లలో FM రేడియోను సులభంగా యాక్సెస్ చేసేందుకు భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీదారులకు అడ్వైజరీని జారీ చేసింది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు రేడియో సర్వీసుల ద్వారా సమాచారం, వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

డిజిటల్ విభజనను తగ్గించడంతో పాటు స్వతంత్ర రేడియో సెట్‌లను కొనుగోలు చేయలేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు రేడియో సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే మొబైల్ తయారీదారులకు తమ ఫోన్లలో తప్పనిసరిగా ఎఫ్ఎం రేడియా సర్వీసులు తప్పక ఉండాలని సూచించింది.

ఎమర్జెన్సీ, విపత్తుల సమయంలో రేడియో సర్వీసులు తప్పనిసరి:
IT మంత్రిత్వ శాఖ ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA), మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MAIT) లకు అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో FM రేడియో అందుబాటులో ఉండాలే చూడాలని అడ్వైజరీ జారీ చేసింది. ఈ అడ్వైజరీ ద్వారా పేదలకు రేడియో సర్వీసులను అందించడమే కాకుండా క్లిష్ట సమయాల్లో ప్రతి ఒక్కరికీ FM కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : Cognizant AI Tools : కాగ్నిజెంట్‌లో 3,500 మంది ఉద్యోగుల తొలగింపు.. ఏఐ టూల్స్‌పై పెట్టుబడి కోసమేనా?

‘మొబైల్ ఫోన్‌లో ఇన్‌బిల్ట్ FM రేడియో రిసీవర్ ఫంక్షన్ లేదా ఫీచర్ ఉన్న చోట.. ఆ ఫంక్షన్ లేదా ఫీచర్ డిసేబుల్ కాదు లేదా డియాక్టివేట్ కాదు. అయితే, మొబైల్ ఫోన్‌లో ఎనేబుల్/యాక్టివేట్ అయినట్టుగా ఫోన్ మేకర్లు నిర్ధారించుకోవాలి. ఇంకా, మొబైల్ ఫోన్‌లలో FM రేడియో రిసీవర్ ఫంక్షన్ లేదా ఫీచర్ అందుబాటులో లేకుంటే.. వెంటనే ఫోన్లలో ఫీచర్ చేర్చవచ్చని సూచించింది”అని ఐటి మంత్రిత్వ శాఖ అడ్వైజరీ తెలిపింది.

FM Radio must be present and enabled on all mobile phones, government advisory warns

FM Radio must be present and enabled on all mobile phones, government advisory warns

మార్కెట్లో ఎఫ్ఎం రేడియో లేని ఫోన్లే ఎక్కువ :
ఇటీవలి సంవత్సరాలలో FM రేడియో అనేది మొబైల్ ఫోన్లలో గణనీయమైన క్షీణతను గమనించినట్లు ఐటి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫ్రీగా FM రేడియో సర్వీసులపై ఆధారపడే పేదలపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు అత్యవసర పరిస్థితులు, విపత్తులు, విపత్తుల సమయంలో రియల్ టైమ్ సమాచారాన్ని పంపగల ప్రభుత్వ సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపింది. విపత్తుల సమయంలో స్వతంత్ర రేడియో సెట్‌లు, కార్ రిసీవర్‌లతో పాటు, FM ఎనేబుల్ మొబైల్ ఫోన్‌ల ద్వారా వేగవంతమైన నమ్మదగిన కమ్యూనికేషన్ అవసరాన్ని ఐటి మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది.

ఇలా చేయడం ద్వారా విలువైన జీవితాలతో పాటు ఎందరో జీవనోపాధిని కూడా కాపాడుతుందని ఐటీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU)ని ఈ అడ్వైజరీ ఉదహరించింది. స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్ఎం రేడియోను చేర్చాలని సిఫార్సు చేసింది. ITU ప్రకారం.. అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలను అందించడానికి రేడియో ప్రసారం అత్యంత శక్తివంతమైనది పేర్కొంది.

Read Also : 2023 Skoda Kodiaq SUV : అద్భుతమైన ఫీచర్లతో 2023 స్కోడా కొడియాక్ కారు.. భారత్‌లో ఫుల్ డిమాండ్.. ధర ఎంతంటే?