Voter ID Address Change: మీ స్మార్ట్ ఫోన్‌తో ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..!

ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలా? అయితే మీ స్మార్ట్ ఫోన్ ద్వారా సింపుల్‌గా అడ్రస్ మార్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడీ కార్డు అడ్రస్ మార్చుకునే విధానాన్ని మరింత సులభతరం చేసింది.

Voter ID Address Change: మీ స్మార్ట్ ఫోన్‌తో ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..!

How To Change Address In Your Voter Id Card Online, Follow These Steps

Voter ID Address Change : ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలా? అయితే మీ స్మార్ట్ ఫోన్ ద్వారా సింపుల్‌గా అడ్రస్ మార్చుకోవచ్చు. అది కూడా ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడీ కార్డు అడ్రస్ మార్చుకునే విధానాన్ని మరింత సులభతరం చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI). మీ ఓటర్ అడ్రస్ మార్చుకోవాలంటే మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నచోటనే మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఈజీగా ఓటర్ అడ్రస్ అప్ డేట్ చేసుకోవచ్చు. మీ ఓటరు కార్డులోని ఏమైనా తప్పులు ఉంటే సులభంగా సరిచేసుకోవచ్చు. ఒకవేళ.. మీరు కొత్త అడ్రస్ కు మారినట్టయితే.. అప్పుడు ఓటర్ ఐడీలో పాత నియోజకవర్గాన్ని మార్చుకోవచ్చు.

మీ కొత్త నియోజకవర్గం వివరాలను కూడా అప్ డేట్ చేసుకోవచ్చు. EIS (భారత ఎన్నికల సంఘం) ఓటరు ఐడిలోని అడ్రస్ మార్చుకునేందుకు ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది. ముందుగా జాతీయ ఓటరు సర్వీసు పోర్టల్ కోసం https://www.nvsp.in/ వెబ్‌సైట్‌లోకి విజిట్ చేయండి. కొత్త ఓటరు రిజిస్ట్రేషన్ కోసం ‘కరెక్షన్’ ఎంచుకోవడం ద్వారా ఆన్‌లైన్ ఫారం వస్తుంది. భర్తీ కోసం ‘Online Apply’ ఎంచుకోండి. అందుబాటులోని 6A/8A ఫారం ఎంచుకోవాలి. మీకు ఆన్‌లైన్ ఫారం కొత్త Tabలో కనిపిస్తుంది. మీ పేరు, ఇంటి అడ్రస్, రాష్ట్రం మీ కొత్త అడ్రస్ సహా పూర్తి వివరాలను ఎంటర్ చేయండి.

మీ ప్రస్తుత అడ్రస్ తెలియచేసే ఒక డాక్యుమెంట్ (ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, లేదా అధికార ద్రువీకర పత్రం) అప్‌లోడ్ చేయండి. మీ ఫారంను పూర్తిగా ఫిల్ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో ఫారంను (Submit) సమర్పించండి. మీరు ఆన్‌లైన్‌లో మీ అప్లికేషన్ ట్రాక్ చేసే ఒక రిఫరెన్స్ నంబరును పంపుతారు. మీ ఫారం అందగానే.. ఎలక్షన్ అధికారులు మీ కొత్త అడ్రస్ కు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫై తర్వాత మీ కొత్త అడ్రస్ కలిగిన కొత్త ఓటరు ఐడి కార్డును పొందవచ్చు.
Read Also :  New Hair Growth : బట్టతలకు ఇక్ గుడ్‌బై.. కొత్త వెంట్రుకలు మొలిచే టెక్నిక్..!