iPhone 13 Discount Sale : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఐఫోన్ 14 కన్నా ఇదే బెటర్.. ఎందుకంటే?

iPhone 13 Discount Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ (iphone 13) భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో వచ్చింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏకంగా iPhone 13పై రూ.9వేలు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు.

iPhone 13 Discount Sale : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఐఫోన్ 14 కన్నా ఇదే బెటర్.. ఎందుకంటే?

iPhone 13 gets flat Rs 9,000 discount on Amazon, but should you buy it or wait for iPhone 14

iPhone 13 Discount Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ (iphone 13) భారీ డిస్కౌంట్ ఆఫర్‌తో వచ్చింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏకంగా iPhone 13పై రూ.9వేలు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గత ఏడాదిలోనే మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే చాలాసార్లు ధర తగ్గింపుతో వచ్చింది. అమెజాన్ మళ్లీ ఐఫోన్ 13ని రూ.70,900 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ఈ డివైజ్ అసలు ధర రూ.79,900గా ఉంది. అంటే.. రూ.9,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఈ భారీ ఆఫర్ గడువు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ, కొనుగోలుదారులు iPhone 13 వెంటనే కొనేసుకోండి. ఇంతకీ ఐఫోన్ 14 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఫోన్ 13 కొనలా? లేదా ఐఫోన్ 14 లాంచ్ అయ్యే వరకు వేచిచూడాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే iPhone 13 ఫోన్ కొనడమే బెస్ట్.. ఎందుకంటే.. iPhone 14 కొత్త రెగ్యులర్ మోడల్ పాత చిప్‌సెట్‌తోనే రానుంది. iPhone 13 కన్నా పెద్ద అప్‌గ్రేడ్‌ ఉండకపోవచ్చునని రూమర్ మిల్ పేర్కొంది. కొత్త iPhone14లోనూ ఐఫోన్ 13 మాదిరిగానే ఫీచర్లు ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. వాస్తవానికి.. కొత్త ఐఫోన్ 14 సిరీస్‌ను అధిక ధరకు మార్కెట్లోకి తీసుకురావాలని ఆపిల్ భావిస్తోందని కొంతమంది నిపుణులు అంటున్నారు.

iPhone 13 gets flat Rs 9,000 discount on Amazon, but should you buy it or wait for iPhone 14

iPhone 13 gets flat Rs 9,000 discount on Amazon, but should you buy it or wait for iPhone 14

మీరు గత ఏడాదిలో iPhone 13తో అదే ఫీచర్లు కలిగి ఉంటే.. iPhone 14 కోసం అధిక ఖర్చు చేయడంలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు సాఫ్ట్‌వేర్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆపిల్ 6 ఏళ్ల స్మార్ట్‌ఫోన్‌కు కూడా సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది. ఐఫోన్ 14 కూడా అదే A15 బయోనిక్ చిప్‌సెట్‌తో రానుంది. ఐఫోన్ 13 సిరీస్‌లోనూ అదే రన్ అవుతుంది. అదే స్క్రీన్ సైజు కలిగి ఉండనుంది. కానీ, అధిక 90Hz రిఫ్రెష్ రేట్‌తో రావచ్చు. ఈ డివైజ్ పాత ఫోన్‌ల మాదిరిగానే 12-MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. Apple సాఫ్ట్‌వేర్ విభాగంలో కొన్ని మార్పులు చేస్తుందని, మెరుగైన అనుభవం కోసం కొత్త ఫొటోగ్రఫీ ఫీచర్‌లను కూడా అందిస్తుందని భావిస్తున్నారు.

కొత్త వెర్షన్ కూడా పాత డిజైన్‌ను మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్ 14 ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌తో వస్తుందని, వైడ్ నాచ్‌ని కలిగి ఉంటుందని చెబుతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ లేదా LTPO డిస్‌ప్లేకు సపోర్ట్‌తో పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్ లేదు. అధిక ధర కలిగిన ఐఫోన్ 14ప్రో మోడళ్లలో అందుబాటులో ఉంటాయని అంటున్నారు. కొత్త వెర్షన్ మునుపటి కన్నా మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తుందని భావిస్తున్నారు.

ఐఫోన్ 13 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. iPhone 13 కొనడం వల్ల ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. కానీ, Apple ఇకపై రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌తో అందించడం లేదని గుర్తుంచుకోండి. మీరు ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి లేదా పాతదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ కోసం రూ. 12,750 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ ఫోన్ కండీషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంటుంది.

Read Also : iPhone 13 Flipkart Offer : మీ దగ్గర ఐఫోన్ 11 ఉందా? ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్.. డోంట్ మిస్!