iPhone Inbuilt Scanner : మీ ఐఫోన్‌లో ఇన్‌బుల్ట్ స్కానర్ ఉందని తెలుసా? చేతిరాత నోట్స్‌ను డిజిటల్ టెక్ట్స్‌గా మార్చుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్!

iPhone Inbuilt Scanner : మీరు ఐఫోన్ (iPhone) వాడుతున్నారా? అయితే, మీ ఐఫోన్‌లో ఇన్‌బుల్ట్ స్కానర్ (iphone Inbuilt Scanner) ఉందని ఎప్పుడైనా గమనించారా? అయితే మీ ఫోన్‌లో మరో థర్డ్ పార్టీ డాక్యుమెంట్ స్కానింగ్ యాప్ అవసరం లేదని గుర్తించుకోండి.

iPhone Inbuilt Scanner : మీ ఐఫోన్‌లో ఇన్‌బుల్ట్ స్కానర్ ఉందని తెలుసా? చేతిరాత నోట్స్‌ను డిజిటల్ టెక్ట్స్‌గా మార్చుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్!

iPhone Inbuilt Scanner Your iPhone has an inbuilt scanner that can convert your handwritten notes into digital text, here is how

iPhone Inbuilt Scanner : మీరు ఐఫోన్ (iPhone) వాడుతున్నారా? అయితే, మీ ఐఫోన్‌లో ఇన్‌బుల్ట్ స్కానర్ (iphone Inbuilt Scanner) ఉందని ఎప్పుడైనా గమనించారా? అయితే మీ ఫోన్‌లో మరో థర్డ్ పార్టీ డాక్యుమెంట్ స్కానింగ్ యాప్ అవసరం లేదని గుర్తించుకోండి. ఈ స్కానర్ మీ డాక్యుమెంట్లను స్కాన్ చేసేస్తుంది. అంతేకాదు.. వాటిని PDFలుగా కూడా మార్చేస్తుంది. ఈ స్కానర్ ద్వారా మీ చేతితో రాసిన నోట్స్ కూడా డిజిటల్ టెక్స్ట్‌లుగా మార్చగలదు. మీరు ఇకపై క్లాస్‌రూమ్‌లో లేదా మీటింగ్‌లో మీరు చేతితో రాసిన ప్రతి పదాన్ని ఇకపై టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీ iPhone Camera దానిని డిజిటల్ టెక్స్ట్‌లుగా మార్చేస్తుంది. మీ ల్యాప్‌టాప్ (Laptop), టాబ్లెట్ (Tablet) లేదా మొబైల్ ఫోన్‌ (Mobile Phone)ని కూడా తీసుకెళ్లలేకపోవచ్చు.

iPhone Inbuilt Scanner Your iPhone has an inbuilt scanner that can convert your handwritten notes into digital text, here is how

iPhone Inbuilt Scanner Your iPhone has an inbuilt scanner

అలాంటి సమయంలో మీరు నోట్స్ రాసుకోవడానికి ఏకైక మార్గం మీ పెన్ (Pen Writing) మాత్రమే.. మీ కంప్యూటర్‌లో పేపర్‌పై మీరు రాసిన ప్రతిదాన్ని టైప్ చేయడం అధిక సమయంతో కూడుకున్న పని. మీ చేతితో రాసిన ప్రతి అక్షరాన్ని డిజిటల్ టెక్స్ట్ పదాలుగా మార్చాలంటే ప్రతిది టైప్ చేయాల్సిందే. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా iPhone స్కానర్ ద్వారా సులభంగా డిజిటల్ టెక్స్ట్‌లుగా మార్చుకోవచ్చు. వాస్తవానికి చాలామంది ఐఫోన్ యూజర్లకు ఈ స్కానర్ యాప్ ఫీచర్ ఒకటి ఉందనే విషయం పెద్దగా తెలియకపోవచ్చు. ఈ ఐఫోన్ ఫీచర్‌ ద్వారా సమయం ఆదా కావడమే కాకుండా, మీరు ఇప్పటికే రాసిన ప్రతిదాన్ని డిజిటల్ టెక్స్ట్ గా మార్చేస్తుంది. తద్వారా మీకు అధిక శ్రమను తగ్గిస్తుంది.

అయితే మీరు ఒకటి గుర్తించుకోవాలి.. మీ చేతిరాత చాలా స్పష్టంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీ ఫోన్ స్కానర్ సులభంగా డిటెక్ట్ చేయగలదు. లేదంటే స్కానర్ పని చేయదు. మీరు డాక్టర్ల ప్రిస్కిప్షన్ మాదిరిగా కలిపి రాసే.. ఆ పదాలను ఐఫోన్ కెమెరా గుర్తించలేదు. అప్పుడు ఆయా పదాలను మళ్లీ మాన్యువల్‌గా టైప్ చేయాల్సి వస్తుంది. మీ చేతిరాత స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి పదం చదవగలిగేలా సరిగ్గా రాయాలి. ఎందుకంటే, మీ చేతివ్రాత అస్పష్టంగా ఉంటే.. ఐఫోన్ కెమెరా తప్పుగా చూపిస్తుంది. చివరిగా మీ చేతితో రాసిన పదాలను డిజిటల్ టెక్స్ట్‌లుగా ఎలా మార్చవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

iPhone Inbuilt Scanner Your iPhone has an inbuilt scanner that can convert your handwritten notes into digital text, here is how

iPhone Inbuilt Scanner Your iPhone has an inbuilt scanner

* మీ iPhoneలో ‘Notes’ యాప్‌ను ఓపెన్ చేయండి.
* New Note క్రియేట్ చేయండి. లేదా ఇప్పటికే ఉన్న దానిని ఓపెన్ చేయండి.
* ఒక అక్షరాన్ని టైప్ చేయండి. ఆపై మీకు కింద కెమెరా ఐకాన్ కనిపిస్తుంది.
* కెమెరా ఐకాన్‌పై Tap చేసి ఆపై “Scan Text” ఆప్షన్‌పై నొక్కండి.
* కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు రాసిన పదం వైపు కెమెరాను చూపించండి.
* పదాన్ని పూర్తిగా గుర్తించడానికి కెమెరా కొన్ని సెకన్ల సమయం పడుతుంది.
* మీ టెక్స్ట్ గుర్తించే వరకు వేచి ఉండాలి. ఆపై Capture మెనుపై నొక్కండి.
* Notes Appలో మీ చేతితో రాసిన నోట్ డిజిటల్ టెక్స్ట్‌గా నమోదు చేయండి.
* మీరు డాక్యుమెంట్లను స్కాన్ చేసి మీ Notes యాప్‌లో కూడా చేర్చవచ్చు.
* ‘Scan Text’ ఆప్షన్ బదులుగా, మీరు “Scan Document” ఆప్షన్‌పై నొక్కాలి.
* కెమెరాను స్కాన్ డాక్యుమెంట్ ఆప్షన్ వైపు చూపించాలి. మీకు అవసరమైనవరకు కట్ చేయండి.
Note :  ఈ ఫీచర్ iOS 15.4, iPadOS 15.4పై రన్ అయ్యే iPhoneలలో మాత్రమే అందుబాటులో ఉంది.

Read Also : iPhone 14 Pro Design Leaked : లాంచ్‌కు ముందే ఆపిల్ 14ప్రో డిజైన్ లీక్.. రాబోయే ఐఫోన్‌‌ 14 గురించి ఈ 5 విషయాలు తెలుసా?