JioMart Users : జియోమార్ట్ యూజర్లు ఇకపై నేరుగా వాట్సాప్ చాట్‌లోనే షాపింగ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

JioMart Users : జియోమార్ట్ (JioMart) యూజర్లకు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జియో (Reliance Jio) వార్షిక సాధారణ సమావేశం (AGM) 2022లో కంపెనీ చీఫ్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) Jio 5G సేవలు (Jio 5G Services), Jio Phone 5G వంటి మరిన్నింటిని ప్రకటించారు.

JioMart Users : జియోమార్ట్ యూజర్లు ఇకపై నేరుగా వాట్సాప్ చాట్‌లోనే షాపింగ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

Reliance Jio Now Lets JioMart Users Shop Groceries directly from WhatsApp

JioMart Users : జియోమార్ట్ (JioMart) యూజర్లకు గుడ్‌న్యూస్.. రిలయన్స్ జియో (Reliance Jio) వార్షిక సాధారణ సమావేశం (AGM) 2022లో కంపెనీ చీఫ్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) Jio 5G సేవలు (Jio 5G Services), Jio Phone 5G వంటి మరిన్నింటిని ప్రకటించారు. వాట్సాప్‌ (Whatsapp)లో మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవాన్ని ప్రారంభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. జియోమార్ట్ వినియోగదారులు తమ వాట్సాప్ చాట్‌లోనే JioMart నుంచి షాపింగ్ చేయవచ్చు. ఈ సర్వీసు కోసం యూజర్లు JioMart మొత్తం కిరాణా కేటలాగ్‌ (Groceries Catalog)ను సజావుగా బ్రౌజ్ చేసేందుకు కార్ట్‌ (Cart)కు వస్తువులను యాడ్ చేసేందుకు వాట్సాప్ చాట్ (Whatapp Chat) నుంచి బయటకు రాకుండానే చాట్ బాక్సులోనే మీకు నచ్చిన కిరాణా సరుకులను కొనుగోలు పూర్తి చేయవచ్చు. అంతేకాదు. అక్కడే మీరు పేమెంట్ కూడా చెల్లించవచ్చు.

అయితే, ఈ వాట్సాప్ సర్వీసును ఉపయోగించాలంటే.. వినియోగదారులు వాట్సాప్‌లోని JioMart నంబర్‌కు ‘Hi’ని పంపవచ్చు. Jio, Meta భాగస్వామ్యంతో Meta వ్యవస్థాపకుడు, CEO మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. భారత మార్కెట్లో JioMartతో భాగస్వామ్యాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. WhatsAppలో తమ మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ ఎక్స్ పీరియన్స్ గా పేర్కొన్నారు. వినియోగదారులు ఇప్పుడు Whatsapp చాట్‌లో JioMart నుంచి కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు.

Reliance Jio Now Lets JioMart Users Shop Groceries directly from WhatsApp

Reliance Jio Now Lets JioMart Users Shop Groceries directly from WhatsApp

ఇలాంటి చాట్-ఆధారిత ఎక్స్ పీరియన్స్ రాబోయే సంవత్సరాల్లో ప్రతి వినియోగాదారునికి అందేలా మరింత కమ్యూనికేట్ చేయవడానికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అగ్రగామిగా భారత్ డిజిటల్ సొసైటీగా ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. 2020లో Jio ప్లాట్‌ఫారమ్‌లు, Meta భాగస్వామ్యాన్ని ప్రకటించినప్పుడు.. జూకర్ బర్గ్ ఎక్కువమంది వినియోగదారులను వ్యాపారాల్లో వచ్చి తమ అభివృద్ధిని పెంచుకునేందుకు వీలుగా మార్గాన్ని సుగమం చేయనున్నట్టు తెలిపారు. అందులో ముఖ్యంగా WhatsAppలో JioMartతో మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ ఎక్స్ పీరియన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తెలిపారు.

వాట్సాప్‌లో జియోమార్ట్ ఎక్స్‌పీరియన్స్ మిలియన్ల మంది భారతీయులకు ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు మార్గాన్ని అందిస్తుందని అంబానీ అన్నారు. ఈరోజు జరిగిన AGM కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ జియో 5G సేవలను ప్రకటించారు. దేశంలో ముందుగా ప్రధాన నగరాలైన కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై సహా 4 నగరాలకు జియో 5G సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు డిసెంబర్ 2023 నాటికి Jio 5G Services పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.

Read Also : JioMart : జియోమార్ట్ ఫుల్ పైసా వసూలు సేల్… 30 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్