ఫీచర్లు అదుర్స్ : శాంసంగ్ గెలాక్సీ A70 వచ్చేసింది 

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇండియా మొబైల్ మార్కెట్లలో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు యూజర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి.

  • Published By: sreehari ,Published On : April 17, 2019 / 12:31 PM IST
ఫీచర్లు అదుర్స్ : శాంసంగ్ గెలాక్సీ A70 వచ్చేసింది 

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇండియా మొబైల్ మార్కెట్లలో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు యూజర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి.

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇండియా మొబైల్ మార్కెట్లలో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్లలో అదిరిపోయే ఫీచర్లు యూజర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. శాంసంగ్ రిలీజ్ చేసిన మరో కొత్త గెలాక్సీ సిరీస్ ఇండియన్ మార్కెట్లలోకి వచ్చేసింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ A70. శాంసంగ్ ఇండియాలో రిలీజ్ చేసిన A-సిరీస్ ల్లో ఇదే లేటెస్ట్. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల ఫుల్ HD+ ఇన్ఫినిటీ-U సూపర్ AMOLED డిసిప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో మాత్రమే కాకుండా ఆక్టా కోర్ Soc సామర్థ్యం ఉంది. స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ కూడా ఉంది.

6GB ర్యామ్, శాంసంగ్ ఒన్ UIతో ఆండ్రాయిడ్ పై పనిచేస్తుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. 32 మెగాఫిక్సల్ రియర్ కెమెరా, ఎఫ్/1.7 అప్రెచర్, సెకండరీ 5-మెగాఫిక్సల్ కెమెరా (ప్రొర్టారైట్ షాట్స్), 8 మెగా ఫిక్సల్  123°అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్, 32 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇలా మరెన్నో ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాదు.. 3D గ్రేడియంట్ గ్లాస్టిక్ బాడీ, 4500mAh బ్యాటరీ సపోర్ట్, 25W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. గెలాక్సీ ఎ70 స్మార్ట్ ఫోన్.. వైట్, బ్లూ, బ్లాక్ కలర్లలో లభ్యమవుతోంది. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంతో తెలుసా? రూ.28వేల 990. 

గెలాక్సీ ఎ70 స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేయాలంటే.. ముందుగా ప్రీ-బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 20, ఏప్రిల్ 30న ప్రీ- ఆర్డర్ సేల్ ప్రారంభం కానుంది. మొబైల్ వినియోగదారులు శాంసంగ్ U ఫ్లెక్స్ (విలువైన రూ.3వేల 799), బ్లూటూత్ హెడ్ సెట్ (రూ.999 విలువైన) కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. మే 1 నుంచి.. గెలాక్సీ ఎ70, ఇతర ప్రొడక్టులు అన్ని రిటైల్ స్టోర్లు, శాంసంగ్ ఈ-షాప్, శాంసంగ్ ఓపెర హౌస్, ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు.

గెలాక్సీ A70 స్పెషిఫికేషన్లు ఇవే :  
*
6.7 అంగుళాలు (2400*1080 ఫిక్సల్స్) Full HD+ 20G9 ఇన్ఫినిటీ-U సూపర్ AMOLED డిసిప్లే
* 2GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 675 మొబైల్ ప్లాట్ ఫాం, అడ్రినో 612GPU
* 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ, 512GB మైక్రో SD కార్డు (ఎక్స్ పాండబుల్)
* ఆండ్రాయిడ్ 9.0 (Pie), శాంసంగ్ వన్ UI
* డ్యుయల్ సిమ్ కార్డు ఆప్షన్
* 32మెగా ఫిక్సల్ రియర్ కెమెరా, LED ఫ్లాష్, ఎఫ్/1.7 అప్రెచర్, 5మెగా ఫిక్సల్ డెప్త్ సెన్సార్ 
* ఎఫ్/2.2 అప్రెచర్, 8మెగా ఫిక్సల్ 123°అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఎఫ్/2.2 అప్రెచర్
* 32MP ఫ్రంట్ కెమెరా, ఎఫ్/2.0 అప్రెచర్
* ఫింగర్ ఫ్రింట్ ఇన్ డిసిప్లే 
* 3.5mm ఆడియో జాక్, FM రేడియో
* 164.2*76*7.9mm, బరువు : 183గ్రాములు
* డ్యుయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac (2.4GHz+5GHz)
* బ్లూ టూత్ 5, GPS + GLONASS, USB Type-C
* 4500mAh (టైపికల్) / 4400mAh battery, 25W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్