టిక్‌టాక్‌కు ధీటుగా తెలంగాణ ‘ఛట్‌పట్‌’

టిక్‌టాక్‌కు ధీటుగా తెలంగాణ ‘ఛట్‌పట్‌’

చైనా యాప్‌ టిక్‌టాక్‌కు ధీటుగా తెలంగాణ యువకుడు ‘ఛట్‌పట్‌’ యాప్‌ను రూపొందించారు. టిక్‌టాక్‌పై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో చట్‌పట్‌కు కూడా ప్లేస్టోర్‌లో డిమాండ్‌ పెరిగింది. టిక్ టాక్ బ్యాన్ అయిన ఒక్కరోజు గ్యాప్‌లోనే ఈ యాప్‌ ప్లేస్టోర్‌ ట్రెండింగ్‌ సోషల్‌ క్యాటగిరీలో టాప్‌-10లో నిలిచింది. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌ చట్‌పట్‌ యాప్‌కు రూపకల్పన చేశారు.

శ్రీనివాస్‌ ఇదివరకు ఏడు యాప్‌లను రూపొందించినప్పటికీ వాటికి సరైన స్పందన రాలేదు. టిక్ టాక్ ఫెయిల్ అయిన సమయంలో చట్‌పట్‌కు రూపకల్పన చేశారు. ఈ యాప్‌ జూన్‌ 29న ప్లేస్టోర్‌ వేదికపైకి వచ్చింది. మొదటిరోజే మూడువేల మందికి పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సోషల్‌ విభాగం ట్రెండింగ్‌లో టాప్‌ 10లో చట్‌పట్‌ 9వ స్థానానికి చేరింది. వినియోగదారులు చట్‌పట్‌కు 4.9 రేటింగ్‌ ఇచ్చారు.

కాకపోతే ఈ ఛట్ పట్ డెడ్ స్లోగా ఉందని వినియోగదారులు నిరుత్సాహం వ్యక్తపరుస్తున్నారు. టిక్ టాక్ ఆప్షన్లతోనే మొదలైన ఈ యాప్ అన్ని ఫీచర్లు ఒకేలా ఉన్నప్పటికీ పనిచేయడంలో మాత్రం చాలా స్లోగా పనిచేస్తుంది.

Read:TikTokను తరిమేశారు.. ‘Chingari’ను ఆదరిస్తున్న భారతీయులు.. ప్లే స్టోర్‌లో 2.5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్!