Toyota Hilux: టయోటా Hilux పికప్ ట్రక్ బుకింగ్ లు ప్రారంభం

భారత్ లో మారుతున్నా వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త వాహనాలను తీసుకురావాలని భావిస్తున్న టొయోటా అందులో మొదట ప్రాధాన్యంగా ఈ Hilux పికప్ ట్రక్ ను ప్రవేశపెట్టింది

Toyota Hilux: టయోటా Hilux పికప్ ట్రక్ బుకింగ్ లు ప్రారంభం

Hilux

Toyota Hilux: జపాన్ కార్ల దిగ్గజం టొయోటా మరో సరికొత్త కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. విదేశాల్లో ఇప్పటికే ఆదరణ పొందిన తన Hilux పికప్ ట్రక్ ను భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధమైంది టొయోటా. జనవరి 23న విడుదల కానున్న ఈ Hilux పికప్ ట్రక్ లకు బుకింగ్ లు ప్రారంభించినట్లు టొయోటా సంస్థ తెలిపింది. భారత్  వినియోగదారుల మారుతున్న అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త వాహనాలను తీసుకురావాలని భావిస్తున్న టొయోటా అందులో మొదట ప్రాధాన్యంగా ఈ Hilux పికప్ ట్రక్ ను ప్రవేశపెట్టింది. ఆస్ట్రేలియా, జపాన్, థాయిలాండ్, అమెరికా, బ్రెజిల్, మెక్సికో సహా మధ్య ఆసియా దేశాల్లో ఇప్పటికే ఈ వాహనానికి మంచి డిమాండ్ ఉంది.

Also read: Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై 40శాతం ఆఫర్.. 4 రోజులు మాత్రమే!

ఈక్రమంలో భారత్ లోనూ ఈ వాహనానికి మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. లైఫ్ స్టైల్ శ్రేణిలో వస్తున్న ఈ Hilux పికప్ ట్రక్ ప్రత్యేకతల గురించి బుధవారం నాడు సంస్థ వివరాలు వెల్లడించింది. ఇన్నోవా crysta, Fortuner ఉపయోగించిన IMV-2 ప్లాట్ఫారమ్ పైనే ఈ Hilux ట్రక్ ను అభివృద్ధి చేశారు. ఆల్ వీల్ డ్రైవ్ (AWD), LED హెడ్ లాంప్స్, 10.4 ఇంచ్ టచ్ స్క్రీన్ వంటి అధునాతన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Also read: Leopard Death: కరోనాతో అత్యంత అరుదైన మంచు చిరుత మృతి

దాదాపుగా Fortuner ఇంజిన్ తో వస్తున్న ఈ Hiluxలో 2.8 లీటర్ ఇంజిన్.. 204hp పవర్, 500Nm టార్క్ కెపాసిటీ ఉంది. ఇంటీరియర్ పరంగానూ టొయోటా Fortunerలో ఉండే అన్ని ఫీచర్స్ ఈ Hiluxలో ఉంటాయని ఆటో బ్లాగ్ సంస్థలు పేర్కొన్నాయి. జంట క్యాబిన్ తో వస్తున్న ఈ పికప్ ట్రక్..దేశీయంగా Isuzu D-Maxకి మంచి పోటీ ఇవ్వనుంది. జనవరి రెండో వారం నుంచి ఈ Hilux బుకింగ్ లు ప్రారంభంకాగా, వినియోగదారులు రూ.1 లక్ష ముందస్తుగా చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. జనవరి 23న విడుదల కానున్న ఈ Hilux పికప్ ట్రక్ ధర భారత్ లో దాదాపుగా రూ.27-30 లక్షలుగా ఉండొచ్చని సమాచారం.

Also read: Elephants rescued: కాలువలో చిక్కుకున్న ఏనుగుల గుంపు