Vivo Y200 5G Launch : వివో Y200 5G ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
Vivo Y200 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వివో నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే ఈ కొత్త ఫోన్ ఫీచర్ల, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Vivo Y200 5G Launch Timeline, Specifications Teased
Vivo Y200 5G Launch : కొత్త వివో ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లోకి వివో (Vivo Y200 5G Launch Timeline) పేరుతో సరికొత్త మోడల్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ 5G ఫోన్ కీలక ఫీచర్లు, ధర వివరాలు ముందే లీకయ్యాయి. గత ఫిబ్రవరిలో (Vivo Y100) లాంచ్ కాగా.. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.38-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది.
వివో మరో కొత్త మోడల్ Y200 5G త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒక ప్రకటనలో రివీల్ చేసింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ కొన్ని రోజుల క్రితమే గూగుల్ ప్లే కన్సోల్ (Google Play Console)లో కనిపించింది. ఇప్పుడు, కొత్త రిపోర్టు ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, లాంచ్ టైమ్‌లైన్, ధర పరిధిని ఆవిష్కరించింది. వివో ఇటీవలే స్మార్ట్‌ఫోన్‌ను కూడా టీజ్ చేసింది.
వివో Y200 5G ఫోన్ ధర (అంచనా) :
మైస్మార్ట్ ప్రైస్ (MySmartPrice) కొత్త నివేదిక ప్రకారం.. వివో Y200 5G లాంచ్ టైమ్‌లైన్‌ను రివీల్ చేసింది. ఈ నెలాఖరు నాటికి భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంతేకాకుండా, ఈ 5G ఫోన్ ధర రూ.24వేల లోపు ఉంటుందని అంచనా. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. OIS సపోర్టుతో స్మార్ట్‌ఫోన్ 64MP ప్రైమరీ కెమెరాను పొందవచ్చని నివేదిక సూచించింది.

Vivo Y200 5G Launch Timeline
స్పెషిఫికేషన్లు, కెమెరా ఫీచర్లు :
టెక్ ఔట్లుక్ గత నివేదికలో వివో Y200 5G గురించి కొన్ని స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఈ డివైజ్ 8GB RAMతో Snapdragon 4 Gen 1 SoC ద్వారా పవర్ పొందవచ్చని సూచించింది. డింప్లీ విషయానికి వస్తే.. 6.67-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుందని, ఆండ్రాయిడ్ 13-ఆధారిత Funtouch OS 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీని అందిస్తుందని భావిస్తున్నారు.
నివేదిక ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ (Google Play) కన్సోల్‌లో గుర్తించవచ్చు. సైట్‌లోని వివరాలు పైన పేర్కొన్న స్పెసిఫికేషన్లను ధృవీకరించాయి. వివో Y200 5G ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే ముందు భాగంలో, డివైజ్ స్క్రీన్ మధ్యలో పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. వివో Y200 5G త్వరలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కచ్చితమైన తేదీని కంపెనీ రివీల్ చేయలేదు.