WhatsApp New Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. ఇక ఆండ్రాయిడ్ టు ఐఫోన్ చాట్ ట్రాన్స్‌ఫర్ ఈజీ..!

మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త అప్‌డేట్ తీసుకొస్తోంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా యూజర్లు తమ చాట్‌లను Android స్మార్ట్‌ఫోన్‌ల నుంచి Apple iPhoneలకు సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

WhatsApp New Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. ఇక ఆండ్రాయిడ్ టు ఐఫోన్ చాట్ ట్రాన్స్‌ఫర్ ఈజీ..!

Whatsapp's New Update Finally Lets Users Transfer Chats From Android To Iphone

WhatsApp New Update : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త అప్‌డేట్ తీసుకొస్తోంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా యూజర్లు తమ చాట్‌లను Android స్మార్ట్‌ఫోన్‌ల నుంచి Apple iPhoneలకు సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. Apple ‘move to iOS’ యాప్‌లో భాగంగా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. iPhone యూజర్లు కొత్త ఫోన్‌ను సెటప్ చేసే సమయంలో ఈ ఆప్షన్ పొందవచ్చు. ఇప్పటికే ఉన్న Apple iPhone యూజర్లు ఈ కొత్త అప్‌డేట్‌ను వినియోగించుకోవాలంటే.. వారి ఫోన్‌లను బ్యాకప్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మెటా సీఈఓ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు.

‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కొనసాగిస్తూనే.. ఫోన్‌ల మధ్య సురక్షితంగా డేటాను మార్చుకోవచ్చు. మీ చాట్ హిస్టరీ, ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లను Android నుంచి iPhone డివైజ్ ల్లోకి సులభంగా ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కోసం చాలామంది యూజర్ల నుంచి అభ్యర్థనలు వచ్చాయని, ఆ క్రమంలోనే కొత్త ఫీచర్ తీసుకురానున్నట్టు కంపెనీ తెలిపింది. గత ఏడాదిలో iPhone>Android నుంచి మారవచ్చు.. Android–>iPhoneని యాడ్ చేసుకోవాలి.

Whatsapp's New Update Finally Lets Users Transfer Chats From Android To Iphone (1)

Whatsapp’s New Update Finally Lets Users Transfer Chats From Android To Iphone

ఆండ్రాయిడ్, ఐఫోన్‌ల మధ్య వాట్సాప్ డేటాను బదిలీ చేయడంపై కొత్త ఫీచర్ కోసం ఎప్పటినుంచో యూజర్లు ఎదురుచూస్తున్నారు. మార్కెట్‌లో కొన్ని థర్డ్-పార్టీ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో యాప్స్ ఫేక్ యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. వాట్సాప్ బీటాలో భాగంగా ఈరోజు నుంచి కొత్త వాట్సాప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వారం రోజుల్లో యూజర్ల అందరికి అందుబాటులోకి రానుంది.

WhatsApp చాట్‌లను Android నుంచి iPhoneకి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే?

– Android ఫోన్‌లో Move to iOS యాప్‌ని ఓపెన్ చేయాలి..
– మీ ఐఫోన్‌లో కోడ్ కనిపిస్తుంది. మీ Android ఫోన్‌లో కోడ్‌ని ఎంటర్ చేయండి.
– Continue ఆప్షన్‌పై Tap చేయండి. ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
– ట్రాన్స్‌ఫర్ డేటా స్క్రీన్‌పై WhatsAppని ఎంచుకోండి.
– మీ Android ఫోన్‌లో ‘Start’ బటన్ ట్యాప్ చేయండి. WhatsApp డేటా Export చేయండి.
– డేటా రెడీ అయిన తర్వాత మీ Android ఫోన్ నుంచి సైన్ అవుట్ అవుతారు.
– మూవ్ టు iOS యాప్‌కి తిరిగి రావడానికి ‘Next’ బటన్ Tap చేయండి.
– మీ Android ఫోన్ నుంచి మీ iPhoneకి డేటాను ‘Continue’ Tap చేయండి.
– iOSకి Transfer పూర్తయినట్లు నిర్ధారించడానికి Wait for Move ఆప్షన్ ఎంచుకోవాలి.
– యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
– WhatsApp ఓపెన్ చేసి.. మీ ఓల్డ్ డివైజ్ ఉపయోగించిన అదే ఫోన్ నంబర్‌తో లాగిన్ చేయండి.
– ప్రాంప్ట్ కనిపించగానే.. Start ఆప్షన్ Tap చేయండి.
– మీ కొత్త డివైజ్ యాక్టివేట్ చేయండి.. మీ ఆండ్రాయిడ్ చాట్స్ డేటా ఐఓఎస్‌లో చూడొచ్చు.

Whatsapp's New Update Finally Lets Users Transfer Chats From Android To Iphone (2)

Whatsapp’s New Update Finally Lets Users Transfer Chats From Android To Iphone

ఆండ్రాయిడ్ 5 లేదా ఆపై iOS 15.5 లేదా ఆపై వెర్షన్‌లో రన్ అయ్యే ఏదైనా స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు తమ ఫోన్‌లు పవర్ సోర్స్‌కి కనెక్ట్ చేసుకోవాలి. Wi-Fi నెట్‌వర్క్‌లో ఉన్నాయని నిర్ధారించుకునేందుకు కొన్ని ప్రాథమిక పద్ధతులను అనుసరించాలి. రెండు ఫోన్‌లు ఒకే Wi-Fi నెట్‌వర్క్‌లో లేకుంటే.. యూజర్లు వారి Android డివైజ్‌ను iPhone హాట్‌స్పాట్‌కి కనెక్ట్ చేయాలి. మొత్తం డేటా ట్రాన్స్‌ఫర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయిందని నిర్ధారించుకోవాలి. అయితే ఆ డేటాను చూడలేమని WhatsApp పేర్కొంది. వాట్సాప్ అకౌంటును డిలీట్ చేయడం లేదా ఫోన్‌ను పూర్తిగా రీసెట్ చేయాలి. లేదంటే.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లో మొత్తం డేటా అలానే ఉంటుందని గుర్తించుకోవాలి.

Read Also : WhatsApp Group : వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిపై వేటు