WhatsApp Group : వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిపై వేటు

ఆఫీసుకు సంబంధించిన సమాచారం షేర్ చేసుకోవటానికి క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేశారు

WhatsApp Group : వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిపై వేటు

Whats App Groups

WhatsApp Group : ఆఫీసుకు సంబంధించిన సమాచారం షేర్ చేసుకోవటానికి క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. మధ్యప్రదేశ్ లోని ఖండ్వాలోని ఎక్సైజ్ శాఖకు చెందిన వాట్సప్ గ్రూప్ లో మే 23వ తేద సాయంత్రం గం.6-15 సమయంలో జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్.పి.అహిర్వార్ ఎక్సైజ్ శాఖ అధికారిక వాట్సప్ గ్రూప్ లో అశ్లీల వీడియోను షేర్ చేశారు.

24 గంటల తర్వాత అది డిలీట్ చేయబడింది. ఆ వీడియో చూసిన డిపార్ట్ మెంట్ లోని మహిళా ఉద్యోగినులు  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణలో తప్పుచేసినట్లు తేలటంతో ఆయనను సస్పెండ్ చేశామని ఎక్సైజ్ అధికారి వికాస్ మంద్లోయ్ చెప్పారు.

కాగా… కుట్ర పూరితంగా తనను ఈ కేసులో ఇరికించారని నిందితుడు అహిర్వార్ ఆరోపించారు. అభ్యంతరకరమైన వీడియోను తాను పోస్ట్ చేయలేదని… తాను ఆఫీసులోని రెస్ట్ రూంకు వెళ్లిన సమయంలో తన ఫోన్ నుంచి ఎవరో  ఈవీడియోను షేర్ చేశారని అనుమానం వ్యక్తం చేశాడు.

Also Read : Potency Test : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. మైనర్లకు లైంగిక సామర్థ్య పరీక్షలు