Telangana Maoists: తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన 19మంది మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం పోలీసులకు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారుల వద్దకు వెళ్లి 19మంది మావోయిస్టులు లొంగిపోయారు. 'వీరిలో 10మంది పులిగుండాలా నుంచి ఉండగా, చెర్ల మండలంలోని బక్కచింతలపాడు నుంచి ఏడుగురు, దుమ్ముగూడెం మండలం ములకనపల్లి నుంచి ఇద్దరు వచ్చినట్లు అధికారులు చెప్పారు.

Telangana Maoists: తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన 19మంది మావోయిస్టులు

19 Maoists Surrender To Police In Telangana

Telangana Maoists: భద్రాద్రి కొత్తగూడెం పోలీసులకు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారుల వద్దకు వెళ్లి 19మంది మావోయిస్టులు లొంగిపోయారు. ‘వీరిలో 10మంది పులిగుండాలా నుంచి ఉండగా, చెర్ల మండలంలోని బక్కచింతలపాడు నుంచి ఏడుగురు, దుమ్ముగూడెం మండలం ములకనపల్లి నుంచి ఇద్దరు వచ్చినట్లు అధికారులు చెప్పారు.

వీరు మాత్రమే కాకుండా ముగ్గురు మహిళా మిలిటియా సభ్యులు కూడా ఉన్నట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఈ 19మంది మిలిటియా, విలేజ్ కమిటీ సభ్యులుగా చెర్ల ప్రాంతంలో వ్యవహరిస్తున్నారు.

మావోయిస్టు లీడర్లు, సభ్యులు, సానుభూతిపరులు అంతా ప్రభుత్వానికి లొంగిపోవాలని చెబుతున్నాం. ఇటీవలి కాలంలో చాలా మీటింగులు జరిగినట్లుగా తెలిసింది. వీటికి గ్రామస్థులు హాజరుకావాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుసుకున్నాం. ఒకవేళ హాజరుకాకపోతే ఒకొక్కరు రూ.500 జరిమానా కట్టాలని కూడా ఆదేశించారు మావోయిస్టులు.. కొద్ది నెలలుగా కొవిడ్-19 పాజిటివ్ వచ్చి చాలా మంది నాయకులు చనిపోతున్నారు. ట్రీట్మెంట్ అందించలేక అడవుల్లోనే ప్రాణాలు విడుస్తున్నారు’ అని ఎస్పీ అన్నారు.

మెరుగైన జీవితం కావాలంటే మావోయిస్టు లీడర్లు, పార్టీ సభ్యులు అంతా తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోవాలని ఎస్పీ సూచించారు.