DH Srinivasa Rao : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 99శాతం సేఫ్ జోన్ లో ఉన్నారు : డీహెచ్ శ్రీనివాసరావు

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ 3కోట్లకు చేరువలో ఉందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 99శాతం సేఫ్ జోన్ లో ఉన్నారని పేర్కొన్నారు.

DH Srinivasa Rao : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 99శాతం సేఫ్ జోన్ లో ఉన్నారు : డీహెచ్ శ్రీనివాసరావు

Srinivasarao

corona vaccine in telangana : తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ 3కోట్లకు చేరువలో ఉందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 99శాతం సేఫ్ జోన్ లో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 36 లక్షల మంది ఇంకా రెండో డోస్ తీసుకోవాల్సి ఉందన్నారు.

మొదటి డోస్ 70శాతానికి పైగా పూర్తైందన్నారు. సెకండ్ డోస్ 39శాతం పూర్తైందని తెలిపారు. మరోవైపు 0.7 శాతం పాజిటివిటీ రేట్ నమోదవుతోందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోని వారిలో 60శాతం మంది కరోనా బారిన పడుతున్నారని వెల్లడించారు.

Cocktail Therapy : ఈ యాంటీబాడీల థెరపీ కొవిడ్ బాధితుల పాలిట వరం.. కరోనా సోకినప్పుడు ట్రంప్ ఇదే వాడారు!

ఒక డోస్ తీసుకున్న వారిలో 30శాతం మంది కరోనా బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో సింగిల్ డోస్ తీసుకున్న వారే ఎక్కువ ఉన్నారని తెలిపారు.