Lover Cut Girlfriend’s Throat : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది

హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేటలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Lover Cut Girlfriend’s Throat : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది

ATTACKED

lover cut girlfriend’s throat : హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేటలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ అనే యవకుడు అదే గ్రామానికి చెందిన యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే యువతిది వేరే మతం కావడంతో యువకుడు మతం మార్చుకున్నాడు. అయినా వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఆమె కూడా అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ మంగళవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశారు. యువతి గొంతు, చేయి కోశాడు.

Boy Friend Attack : ప్రేమ పేరుతో ప్రియురాలిపై దాడి, దోపిడీ చేసిన ప్రియుడు

అడ్డొచ్చిన యువతి కుటుంబ సభ్యులపై సైతం దాడి చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయాలపాలైన యువతిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.