స్వస్తిక్‌ సింబల్‌ ఓట్ల లెక్కింపు… సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

  • Published By: bheemraj ,Published On : December 5, 2020 / 01:14 PM IST
స్వస్తిక్‌ సింబల్‌ ఓట్ల లెక్కింపు… సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

High Court shock SEC : తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం సవాల్‌ చేయగా.. ధర్మాసనం తోసిపుచ్చింది.



జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్‌ సింబల్‌ ఓట్లనే లెక్కించాలన్న సింగిల్‌ జడ్జి తీర్పును SEC సవాల్‌ చేసింది. అయితే సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.



మరోవైపు సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల కారణంగానే నేరెడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎన్నికల సంఘం వాదిస్తోంది. అయితే సిబ్బందికి శిక్షణలోపమే దానికి కారణమని హైకోర్టు అభిప్రాయపడింది.



సింగిల్‌ జడ్జి దగ్గర విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీలు చేసుకోవాలని సూచించింది. సోమవారం ఉదయమే విచారణ జరపాలని సింగిల్‌ జడ్జికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.