Attack On KA Paul : కేఏ పాల్ పై దాడి

సిరిసిల్ల వెళ్తుండగా కేఏ పాల్ వస్తున్నారనే సమాచారంతో జిల్లా సరిహద్దులో ఓ పార్టీ కార్యకర్తలు, కేఏ పాల్ ను అడ్డుకుని ఆయనపై దాడి చేశారు.

Attack On KA Paul : కేఏ పాల్ పై దాడి

Attack Ka Paul

Attack on KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పై దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ గ్రామంలో వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ పై చేశారు. ఆ సమయంలో ఆయనపై దాడి చేశారు. సిరిసిల్ల వెళ్తుండగా కేఏ పాల్ వస్తున్నారనే సమాచారంతో జిల్లా సరిహద్దులో ఓ పార్టీ కార్యకర్తలు, కేఏ పాల్ ను అడ్డుకుని ఆయనపై దాడి చేశారు.

ఏకంగా డీఎస్పీ ముందే కేఏ పాల్ పై కార్యకర్త చేయి చేసుకున్నారు. జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తి కేఏ పాల్ పై దాడి చేశాడని తెలుస్తోంది. దాడికి పాల్పడింది టీఆర్ఎస్ కార్యకర్తేనని కేఏ పాల్ చెబుతున్నారు. రైతులను పరామర్శించేందుకు వెళ్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందకు కేఏ పాల్ వెళ్లారు.

TRS Plenary : టీఆర్ఎస్ ఫ్లెక్సీల ఏర్పాటుపై కేఏ పాల్ పిటిషన్

దీంతో పోలీసుల తీరుపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. ఆర్డర్ చూపిస్తేనే వెనక్కి వెళ్తానంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ చంపిస్తారని, నెల రోజుల క్రితం చెప్పానని ఇప్పుడు రుజువు అయిందన్నారు కేఏ పాల్. వీళ్లు గుండా, మాఫియాను పెట్టి తనను కొట్టించారని, వెహికిల్ పై అటాక్ చేశారని తెలిపారు.

సిద్దిపేట నియోజకవర్గంలో రైతులు పిలిచారని చూడటానికి వెళ్తున్నట్లు చెప్పారు. తాను గుండాలు, మాఫియాలను తీసుకెళ్లలేదని చెప్పారు. ఎస్పీతో మాట్లాడానని, రికార్డు అయి ఉందన్నారు. తామ విజిట్ చేస్తున్నామని, ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉంటే మీరు పైలెట్ వెహికిల్ పెట్టాలని కోరినట్లు తెలిపారు. ఐదు, పది నిమిషాలు రైతులతో ఉండి, వారికి కొంత దానం చేసి, సపోర్టు చేసి తిరిగి వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. కానీ అడుగడుగునా అడ్డుకున్నారని పేర్కొన్నారు.

KA Paul On Telangana : తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే..నేనే..నేనే-కేఏ పాల్ హాట్ కామెంట్స్

రాజశేఖర్ రెడ్డి 2008, 2009లో అడ్డుకుని నాశనం అయిపోయారని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటున్నారు.. వీరు కూడా నాశనం అవడం ప్రజలు కళ్లతో చూస్తారని తెలిపారు. ఇది గుండా రాజ్యం, అవినీతి రాజ్యం అని మండిపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆరోపించారు.

కార్యకర్తలు గుండాల్లా పని చేస్తారా? తనను కొట్టిస్తారా? ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ఎస్పీ, డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్ఐ అనిల్ కుమార్ వీళ్లందరిపై దేవుని చర్యలు పడతాయి.. కోర్టు ద్వారా చర్యలు ఉంటాయని తెలిపారు. ఎవరైతే తనపై దాడి చేసి, కొట్టిన వారిని తక్షణం అరెస్టు చేయాలి, పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.