Bandi Sanjay : ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలు.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.

Bandi Sanjay : ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలు.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay

Bandi Sanjay Letter KCR : ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఓఆర్ఆర్ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మౌనం ఓఆర్‌ఆర్‌ టెండర్‌లో భారీ స్కామ్‌ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తున్నాయని తెలిపారు.

ఓఆర్‌ఆర్‌ టెండర్‌ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటి అని నిలదీశారు. టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులతో బెదిరించడం సిగ్గుచేటన్నారు.

MLA Sanjay Kumar : జగిత్యాల మాస్టర్ ప్లాన్ G.O 238 రద్దు.. కేంద్రం గైడ్ లైన్ ప్రకారమే మాస్టర్ ప్లాన్ : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్‌ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణయే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు.