Nagam Janardhan Reddy : పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్లా? పొంగులేటి కూడా ఒక లీడరేనా- నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు

పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్టు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అర్హత లేని వాళ్లని పార్టీలో చేర్చుకొని అందలమెక్కిస్తున్నారు. Nagam Janardhan Reddy

Nagam Janardhan Reddy : పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్లా? పొంగులేటి కూడా ఒక లీడరేనా- నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు

Nagam Janardhan Reddy Fires On Congress

Nagam Janardhan Reddy Fires On Congress : కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ లో నాకు నమ్మకద్రోహం జరిగిందని ఆయన ఆరోపించారు. నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో తెలియడం లేదన్నారు. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని నాగం ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నాగం జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

”అవినీతిపై పోరాటం చేస్తే టికెట్ ఇవ్వరా? కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి కృషి చేశా. ఇది తప్పా? దళిత గిరిజన ఆత్మగౌరవ సభ పెట్టి పార్టీ ఇమేజ్ పెంచా. ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ సభలు, యాత్రలు సక్సెస్ చేశా. అప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని నేనే గెలిపించా. తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ లో ఉంటూనే కొడుకు రాజేశ్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ అడుగుతున్నారు. ఇదెక్కడి న్యాయం?

Also Read : BRS ముఖ్యనేతల పోటీ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్‌, వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అడుగులు

ఆనాడు గుడిపల్లి గట్టు రిజర్వాయర్ కోసం పోరాటం చేసింది నేనే. మార్కండేయ రిజర్వాయర్ పై పోరాటం చేస్తేనే పనులు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ కోసం నేను పోరాడితే టికెట్ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి తనయుడికా? ఇదేమి తీరు? పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్టు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అర్హత లేని వాళ్లని పార్టీలో చేర్చుకొని అందలమెక్కిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఒక లీడరేనా?” అంటూ నిప్పులు చెరిగారు నాగం జనార్దన్ రెడ్డి.

Also Read : 45 రోజులు మా కోసం పని చేయండి, ఐదేళ్లు మేము మీకోసం చేస్తాం : కేటీఆర్