బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ : ఏ1 నిందితుడు ఏవీ సుబ్బారెడ్డి.. ఏ2 భూమా అఖిలప్రియ : హైదరాబాద్ సీపీ

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ : ఏ1 నిందితుడు ఏవీ సుబ్బారెడ్డి.. ఏ2 భూమా అఖిలప్రియ : హైదరాబాద్ సీపీ

Bhuma Akhila Priya Arrest Kidnap Case : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న విచారణ కొనసాగుతోంది. కృష్ణ రెసిడెన్సీ నుంచి కిడ్నాప్ జరిగిందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. హఫీజ్ పేట్ ల్యాండ్ విషయంలో గత ఏడాది నుంచి వివాదం జరుగుతోందని ఆయన అన్నారు. ఐటీ అధికారుల్లా ఫేక్ సెర్చ్ వారెంట్‌తో ఇంట్లోకి వెళ్లారని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్ ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారని చెప్పారు.

భూమా అఖిలప్రియ, భార్గవ్ ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని సీపీ తెలిపారు . హపీజ్ పేట్ లో ఉన్న ల్యాండ్ విషయంలోనే కిడ్నాప్ చేశారన్నారు. అఖిలిప్రియ, భార్గవ్ రామ్ తో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందని సీపీ చెప్పారు.  ఎఫ్ఐఆర్ ప్రకారం ఏవీ సుబ్బారెడ్డి ఏ1 నిందితుడని అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఏ2 అఖిలప్రియ, ఏ3 భార్గవ్రామ్ నిందితుడిగా ఉన్నట్టు తెలిపారు.

ఐటీ అధికారులమంటూ గంటపాటు సోదాలు జరిపారని అంజనీకుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి ప్రవీణ్, సునీల్, నవీన్ లను కిడ్నాప్ చేశారన్నారు. బేగంపేట్ మహిళా పోలీసు స్టేషన్ లో అఖిలిప్రియను పోలీసులు విచారించారు.

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో అఖిలిప్రియకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరచనున్నారు.ప్రస్తుతం.. అఖిల భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నట్టు సమచారం.