Telangana : బండి పాదయాత్రలో బిగ్ ట్విస్ట్..పాలమూరులో బీజేపీకి దిమ్మతిరిగే షాకిస్తున్న టీఆర్ఎస్

బీజేపీ ఒకటి తలిస్తే.. టీఆర్ఎస్ నూటొక్కటి తలిచింది. పాదయాత్రను ముందు చూపి.. వెనుక వాళ్లేదో చేద్దామనుకుంటే.. ఆ చాన్స్ లేకుండా.. వాళ్ల కంటే ముందే.. వీళ్లే ఆ పని చేసేశారు. చేస్తూనే ఉన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు.. పాలమూరు గులాబీ నేతలు షాక్ ఇస్తున్నారు.

Telangana : బండి పాదయాత్రలో బిగ్ ట్విస్ట్..పాలమూరులో బీజేపీకి దిమ్మతిరిగే షాకిస్తున్న టీఆర్ఎస్

Big Twist In Bandi Sanjay Padayatra

Telangana : బీజేపీ ఒకటి తలిస్తే.. టీఆర్ఎస్ నూటొక్కటి తలిచింది. పాదయాత్రను ముందు చూపి.. వెనుక వాళ్లేదో చేద్దామనుకుంటే.. ఆ చాన్స్ లేకుండా.. వాళ్ల కంటే ముందే.. వీళ్లే ఆ పని చేసేశారు. చేస్తూనే ఉన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు.. పాలమూరు గులాబీ నేతలు షాక్ ఇస్తున్నారు. అది మామూలు షాక్ అయితే.. మనం మాట్లాడుకోవాల్సిన పనిలేదు. మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ మరి. ఐడియా బీజేపీదే. కానీ.. టీఆర్ఎస్ అమలు చేస్తోంది. దీంతో.. కమలదళం అలసిపోతోంది. ఇదే ట్విస్టు. పాలమూరులో బీజేపీ సభకు ముందు.. ఇలాంటి న్యూస్ కాషాయ పార్టీకి కషాయం లాంటిదే.

రోజురోజుకు నెలలు తగ్గిపోతున్నాయ్.. ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్. రాబోయే ఎలక్షన్‌ని దృష్టిలో ఉంచుకొని.. అన్ని రాజకీయ పార్టీలు గ్రౌండ్ లెవెల్‌లో పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాయ్. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కూడా విడతల వారీగా పాదయాత్రలు చేస్తూ.. జనానికి పార్టీని చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే టైంలో.. అంటే ఈ యాత్ర కొనసాగుతుండగానే.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో అసంతృప్తితో రగిలిపోతున్న లోకల్ లీడర్లను టార్గెట్ చేసి.. బీజేపీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి.. బండి సంజయ్ పాదయాత్ర వెనకున్న ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. బండి యాత్రలోనే.. ఇతర పార్టీల నేతలను బీజేపీ బండి ఎక్కించుకునేందుకు.. లోలోపల గట్టిగానే ప్లాన్ చేశారట.

Also read : Hindu Sisters: తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు ఈద్‌గాహ్‌కు స్థలాన్ని విరాళమిచ్చిన కూతుళ్లు

అలంపూర్‌లో మొదలైన బండి పాదయాత్ర గద్వాల్, మక్తల్, దేవరకద్ర మీదుగా.. మహబూబ్‌నగర్ దాకా వచ్చింది. ఈ నియోజకవర్గాలన్నింటిలో.. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినప్పటికీ.. బండి సంజయ్ పాదయాత్రలోనే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న నేతలను.. కమలదళంలో చేర్చుకునేందుకు ప్లాన్ వేశారు. దీనికి సంబంధించి.. అలర్టైన టీఆర్ఎస్ నేతలు.. బీజేపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చారు. టీఆర్ఎస్ నేతలను.. బీజేపీలో చేర్చుకుందామని కాషాయం నేతలు ప్లాన్ చేస్తే.. రివర్స్‌లో గులాబీ నాయకులే.. బీజేపీ నుంచి స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలిచిన ప్రజాప్రతినిధులను కారెక్కించుకుంటున్నారు. బండి సంజయ్ పాదయాత్ర సాగిన నియోజకవర్గాల్లోని.. బీజేపీ ప్రతినిధులకు గాలం వేసి.. గులాబీ కండువా కప్పేశారు.

దేవరకద్రలో బండి సంజయ్ పాదయాత్ర పూర్తయ్యే నాటికి.. ఆ నియోజకవర్గంలోని కొందరు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు.. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అలాగే.. మహబూబ్‌నగర్‌లో పాదయాత్రకు ముందు బీసీ సెంటిమెంట్‌తో.. కొందరు నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు.. కమలం నేతలు జరిపిన చర్చలకు టీఆర్ఎస్ చెక్ పెట్టింది. గతంలో బీజేపీలో చేరిన నాయకులకు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మళ్లీ గులాబీ కండువా కప్పేశారు.

Also read : NASA: నగ్న చిత్రాలతో ఏలియన్స్‌ను ఆకర్షించేలా.. నాసా శాస్త్రవేత్తల వినూత్న ప్రయత్నం..

ఈ మధ్యకాలంలో.. పాలమూరు జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాషాయం పార్టీ వలలో.. గులాబీ కేడర్ పడకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఫోకస్ పెంచారు. అయినప్పటికీ.. పట్టు వదలకుండా జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను.. తమ పార్టీలో చేర్చుకునేందుకు.. బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు.. మహబూబ్‌నగర్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో.. బండి సంజయ్ పాదయాత్ర జరగబోయే నియోజకవర్గాలన్నీ.. ఆపరేషన్ ఆకర్ష్‌తో ఊగిపోతున్నాయ్. ఎవరు.. ఎవరిని.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. లాగేస్తారో.. ఏ కండువా కప్పేస్తారో తెలియక.. కింది స్థాయిలో ఉండే లీడర్లలో.. అయోమయం నెలకొంది.