Revuri Prakash Reddy : కాంగ్రెస్ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి
రేవంత్ రెడ్డి స్వయంగా పరకాల సీటు ప్రతిపాదన చేశారు.. కానీ, తనకు మాత్రం వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేయాలని ఉందన్నారు. తాను పాలకుర్తి నుంచి పోటీ చేస్తాననే ప్రచారం కరెక్ట్ కాదని చెప్పారు.

Revuri Prakash Reddy
BJP Leader Revuri Prakash Reddy : బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పార్టీ మారడంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై రేవూరి ప్రకాశ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనను, మండవ వెంకటేశ్వర్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానించారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ జిల్లాలో రేవూరి ప్రకాష్ రెడ్డి 10టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వూ ఇచ్చారు.
బుధవారం ములుగు రామప్ప దేవాలయానికి కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని కోరారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ లో చేరడం ఖాయమేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా పరకాల సీటు ప్రతిపాదన చేశారు.. కానీ, తనకు మాత్రం వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేయాలని ఉందన్నారు.
తాను పాలకుర్తి నుంచి పోటీ చేస్తాననే ప్రచారం కరెక్ట్ కాదని చెప్పారు. పరకాల నుంచి పోటీకి ఒప్పుకున్నానని తెలిపారు. బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ పార్టీలో తనకు నష్టం చేసే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. తాను బాగా ఇబ్బంది పడ్డానని తెలిపారు. రాజకీయంగా సీఎం కేసీఆర్ ను తట్టుకోవాలంటే బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ సరిపోడు.. ఆ స్థాయి పార్టీలో ఈటల రాజేందర్ కే ఉందన్నారు.
బీజేపీ జాతీయ పార్టీ రాష్ట్ర వ్యవహారాల్లో తప్పుడు నిర్ణయం తీసుకుందని చెప్పారు. పరకాల విషయంలో కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వ్యవహారం టీపీసీసీ చీఫ్ రేవంత్ చూసుకుంటారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే వారికి సముచిత ప్రాధాన్యం ఉంటుందని రేవంత్ చెప్పారు.. ఎవరు ఏదైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు.