Coronavirus : కరోనాకు తలవంచిన కండల వీరుడు

కరోనా ప్రభావం ఉపిరితిత్తులపై అధికంగా పడితే ఎక్మో చికిత్స అవసరమవుతుంది. అయితే సుశీల్ కు అది చేయకుండానే సుదీర్ఘ కాలం చికిత్స చేశారు.. కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు వైద్యులు. కరోనాకి ముందు 100 కిలోల బరువున్న సుశీల్ ప్రస్తుతం 72 కిలోలకు తగ్గిపోయాడు.

Coronavirus : కరోనాకు తలవంచిన కండల వీరుడు

Coronavirus

Coronavirus : కరోనా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనివారిని కూడా అల్లాడిస్తుంది. కండలు తిరిగిన దేహం ఉన్నవారికి కూడా ఊపిరాడకుండా చేస్తుంది. దీని బారినపడి ఎందరో బాడీ బిల్డర్లు, జిమ్ ట్రైనర్లు మృతి చెందారు.. కాగా హైదరాబాద్ కు చెందిన ఓ బాడీబిల్డర్ కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువు అంచుల వరకు వెళ్ళివచ్చాడు.

మల్కాజిగిరికి చెందిన 32 ఏళ్ల సుశీల్‌ కుమార్‌ గైక్వాడ్‌ తెలంగాణ తరఫున బాడీబిల్డింగ్‌ క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఆయనకు కరోనా సోకింది.. క్రమేణా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆసుపత్రిలో చేరాడు. అయితే మేనెలలో కరోనా పీక్స్ లో ఉండటంతో ఆసుపత్రిలో బెడ్ల సమస్య వచ్చింది.

సుశీల్ కి బెడ్ దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు సినీ నటుడు సోనూసూద్‌ను అర్థించారు. ఆయన చొరవతో మే 19 న సుశీల్ కు బెడ్ దొరికింది. అయితే సుశీల్ ఆసుపత్రిలో చేరే సమయానికి ఊపిరితిత్తులు దాదాపు 80 శాతం ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు సీటీస్కాన్‌లో తేలింది. దీంతో డాక్టర్లు బ్రతుకుతాడనే గ్యారెంటీ ఇవ్వలేదు.