Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యం : కిషన్ రెడ్డి

కేసీఆర్ కు సీఎం సీటులో కూర్చునే నైతిక హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కు పంపాలని పిలుపునిచ్చారు.

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యం : కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy – BRS and Congress : బీఆర్ఎస్, కాంగ్రెస్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని విమర్శించారు. దోపిడీ, అవినీతి, అహంకారం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ఉన్నాయని విమర్శించారు. ప్రజా సంపదను లూఠీ చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు సీఎం సీటులో కూర్చునే నైతిక హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. బీఅర్ఎస్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కు పంపాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక నుంచి డబ్బులు వస్తున్నాయని తెలిపారు. బెంగళూరు ఆర్టీ నగర్ లో ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో రూ. 42 కోట్లు బయటపడ్డాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లూఠీలే కొనసాగుతున్నాయని తెలిపారు. ఛత్తీస్ ఘడ్ లో ఆవు పేడ కుంభకోణం బయటపడిందన్నారు. ఆవు పేడను కూడా కాంగ్రెస్ పార్టీ వదలడం లేదని ఎద్దేవా చేశారు.

Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఖరారు

రాహుల్ గాంధీ చేసింది జోడో యాత్ర కాదు ఇండియా లూఠో యాత్ర అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కరప్షన్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంగడిగా మార్చేశారని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా దొంగ పత్రాలు సృష్టించి అభివృద్ధి పనుల పేరుతో వివిధ సామాజిక వర్గాలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

తొమ్మిదేళ్లలో కమీషన్ రూపంలో వచ్చిన డబ్బులను ఈ ఎన్నికలలో ఖర్చు పెట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. జలయజ్ఞం, భూ యజ్ఞం పేరుతో కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసిందని విమర్శించారు. బోఫోర్స్, బొగ్గు, కామన్ వెల్త్, టెలికాం వంటి భారీ అవినీతి కుంభకోణాలు చేసి కాంగ్రెస్ పార్టీ దేశ సొమ్మును లూటీ చేసిందన్నారు. పొన్నాల లక్ష్మయ్య పెనం మీద నుండి పొయ్యిలో పడుతున్నాడని అన్నారు.

Assembly Elections 2023: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిన అసంతృప్తులు.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన మరో ఇద్దరు కీలక నేతలు

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడమే కేసీఆర్ లక్ష్యం అన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కూడా క్లియర్ గా చెప్పాడని తెలిపారు. ఏ ప్రాతిపదికన ప్రవళిక మరణంపై ఆరోపణలు చేస్తున్నారో పోలీసులు చెప్పాలని, వారి దగ్గర ఉన్న ఆధారాలను బయట పెట్టాలని అన్నారు. పరీక్షలు వాయిదా పడడంతో మనస్థాపానికి గురైందని కుటుంబ సభ్యులే చెప్పారని తెలిపారు. ప్రవళికకు సంఘీభావంగా లక్షలాది మంది యువత కదిలి వచ్చారని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో యువత నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను గోల్ మాల్ వ్యవహారంగా మార్చారని విమర్శించారు. లక్షలాది మంది యువత జీవితాలతో ఆడుకుంటున్న టీఎస్పీఎస్సీని రద్దు చేయకుండా ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ సుపరిపాలనను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని తెలిపారు.