Bullet Bandi : వధువుకు పెద్ద అవకాశం, ప్రధాన పాత్రలో ఓ పాట వచ్చేస్తోంది

పెళ్లి బరాత్ లో ఈమె చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ డ్యాన్స్ చేసిన యువతికి ఓ బంపర్ ఆఫర్ వచ్చేసింది. తదుపరి పాటకు డ్యాన్స్ చేయాలని సంస్థ నిర్వాహకులు సూచించారు.

Bullet Bandi : వధువుకు పెద్ద అవకాశం, ప్రధాన పాత్రలో ఓ పాట వచ్చేస్తోంది

Bullet

Bullet Bandi Bride : బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా…డుగ్గు…డుగ్గు..డుగ్గు..డుగ్గు అనే ప్రయివేట్ ఆల్బమ్ సాంగ్‌కు వధువు చేసిన డ్యాన్స్‌ చూసి సోషల్ మీడియాను ఊపేసిన సంగతి తెలిసిందే. పెళ్లి బరాత్ లో ఈమె చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ డ్యాన్స్ చేసిన యువతికి ఓ బంపర్ ఆఫర్ వచ్చేసింది. తాము నిర్మించే తదుపరి పాటకు డ్యాన్స్ చేయాలని సంస్థ నిర్వాహకులు ఆమెకు ఆఫర్ ఇచ్చారు. వచ్చిన ఆఫర్ తో ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More : Woman Return : మరణించిందని అంత్యక్రియలు చేసిన 11 ఏళ్లకు తిరిగొచ్చింది

మంచిర్యాల జిల్లా జిన్నారంకు చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ ఓ రాము, సురేఖ దంపతుల కుమార్తె సాయి శ్రియను రామకృష్ణాపూర్ కు చెందిన ఆకుల అశోక్ తో ఈనెల 14వ తేదీన పెళ్లి జరిగింది. అప్పగింతల సమయంలో..శ్రియ డ్యాన్స్ చేసింది. ఓ జానపదానికి సంబంధించిన పాటకు సూపర్ డ్యాన్స్ చేసింది. నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకోబోతున్న సంతోషాన్ని..జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుంది. సిగ్గులమొగ్గవుతూ వరుడి పక్కన ఒదిగిపోవడం కాకుండా…స్వయంగా తనకు కాబోయే భర్తకు స్వాగతం పలికింది. తన గుణగుణాలు తెలియజేస్తూ రోడ్డుపై ఆడిపాడింది. వరుడు చిరునవ్వులు చిందిస్తూ…చూస్తుండగా…బంధువులు, స్నేహితులు మధ్య ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేసింది. తెలుగు నెటిజన్లంతా బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా…డుగ్గు…డుగ్గు..డుగ్గు..డుగ్గు అనే పాడుకుంటున్నారు.

Read More : Afghanistan : తాలిబన్లతో అమెరికా రహస్య స్నేహం బట్టబయలు

ఆమె డ్యాన్స్ చేసిన పాటను ‘బ్లూ రాబిట్ ఎంటర్ టైన్ మెంట్’ నిర్మించింది. లక్ష్మణ్ (రచయిత) సాహిత్యానికి ఎస్ కే బాజీ సంగీతం అందించారు. ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఈ పాటను ఆ సంస్థ అద్భుతంగా తెరకెక్కించింది. తాజాగా..సంస్థ నిర్వాహకులు నిరూప స్పందించారు. సాయి శ్రియతో నిరూప ఫొన్ లో మాట్లాడారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించే పాటకు నటించాలని చెప్పడంతో సాయి శ్రియ సంతోషం వ్యక్తం చేసింది. దీంతో సాయి శ్రియ ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది.