Munugode By Elections : మునుగోడు ఉప ఎన్నికపై 28 ఫిర్యాదులు : సీఈవో వికాస్‌ రాజ్‌

మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటివరకు 28 ఫిర్యాదులు అందినట్లు సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లాడినట్లు సీఈవో తెలిపారు.

Munugode By Elections : మునుగోడు ఉప ఎన్నికపై 28 ఫిర్యాదులు : సీఈవో వికాస్‌ రాజ్‌

ceo vikas raj (1)

Updated On : November 3, 2022 / 5:58 PM IST

Munugode By Elections : మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటివరకు 28 ఫిర్యాదులు అందినట్లు సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫిర్యాదుపై ఈసీతో మాట్లాడినట్లు సీఈవో తెలిపారు. ఫిర్యాదు వచ్చిన సామాజిక మాధ్యమాల లింకుల ద్వారా విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

మర్రిగూడలో రెండు వర్గాల మధ్య చిన్న ఘర్షణ జరిగినట్లు తెలిపారు. పోలీసులు వెంటనే కలగజేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారన్నారు. అలాగే మునుగోడులో మూడు చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తినట్లు సీఈవో తెలిపారు. మరో చోట 20 ఓట్లు పడ్డాక ఈవీఎం మొరాయించడంతో రీప్లేస్‌ చేసినట్లు చెప్పారు. ఈవీఎం సమస్యలను ఎప్పటికప్పుడు సరిచేస్తున్నట్లు వెల్లడించారు.

Munugode Bypoll: కేటీఆర్ హామీ ఇవ్వడంతో ఓట్లు వేసేందుకు ఒప్పుకున్న రంగంతండా, అజ్మీరాతండా వాసులు

ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నారనే, పోలింగ్‌ కేంద్రాల వద్ద గుర్తులు ప్రదర్శిస్తున్నారనే ఫిర్యాదులపై తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటి వరకు 42 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపించినట్లు వెల్లడించారు.