Munugode Bypoll: కేటీఆర్ హామీ ఇవ్వడంతో ఓట్లు వేసేందుకు ఒప్పుకున్న రంగంతండా, అజ్మీరాతండా వాసులు

ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమ సమస్యలు తీరడం లేదని అక్కడి ఓటర్లు చెప్పారు. ఎన్నికను బహిష్కరిస్తున్నామని అన్నారు. మిగతా ప్రాంతాల ప్రజలు అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తుంటే రంగం తండా ,అజ్మీరా తండా వాసులు మాత్రం గ్రామం నుంచి కదలలేదు. దీంతో ఈ విషయం తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. చర్చలు జరిపారు. తండాలో వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఓటు వేయడం ప్రజల బాధ్యత అని చెప్పారు. కేటీఆర్ ఇచ్చిన హామీతో ఓటు వేసేందుకు రంగం తండావాసులతో పాటు అజ్మీరాతంగడా వాసులు కదిలారు.

Munugode Bypoll: కేటీఆర్ హామీ ఇవ్వడంతో ఓట్లు వేసేందుకు ఒప్పుకున్న రంగంతండా, అజ్మీరాతండా వాసులు

Munugodu bypoll

Munugode Bypoll: తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అయితే, తమ తండాకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తేనే ఓటు వేస్తామని గట్టుప్పల్ మండలంలోని రంగం తండావాసులతో పాటు అజ్మీరాతండా వాసులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఓటు వేసేదే లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు.

ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమ సమస్యలు తీరడం లేదని అక్కడి ఓటర్లు చెప్పారు. ఎన్నికను బహిష్కరిస్తున్నామని అన్నారు. మిగతా ప్రాంతాల ప్రజలు అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తుంటే రంగం తండా ,అజ్మీరా తండా వాసులు మాత్రం గ్రామం నుంచి కదలలేదు.

దీంతో ఈ విషయం తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. చర్చలు జరిపారు. తండాలో వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఓటు వేయడం ప్రజల బాధ్యత అని చెప్పారు. కేటీఆర్ ఇచ్చిన హామీతో ఓటు వేసేందుకు రంగం తండావాసులతో పాటు అజ్మీరాతంగడా వాసులు కదిలారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..