Medak : కారు డిక్కీలో డెడ్ బాడీ దగ్ధం, చంపింది ఎవరు ?

మెదక్‌ జిల్లా కారు డిక్కీలో డెడ్‌బాడీ దగ్ధం ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. కీలకమైన విషయాలను రాబట్టారు. హత్యకు గల కారణాలను ప్రాథమికంగా నిర్ధారించారు.

Medak : కారు డిక్కీలో డెడ్ బాడీ దగ్ధం, చంపింది ఎవరు ?

Medak

Charred Body : మెదక్‌ జిల్లా కారు డిక్కీలో డెడ్‌బాడీ దగ్ధం ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ హత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. కీలకమైన విషయాలను రాబట్టారు. హత్యకు గల కారణాలను ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ఆధారంగా చనిపోయిన వ్యక్తి మెదక్‌ పట్టణానికి చెందిన రియల్టర్‌ ధర్మకారి శ్రీనివాస్‌గా గుర్తించారు పోలీసులు. ఇక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. వెల్దుర్థి మండలం జప్తిశివనూర్‌కి చెందిన ఓ మహిళతో గత కొన్నాళ్లుగా శ్రీనివాస్ సంబంధం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ మహిళ బంధువులే శ్రీనివాస్‌ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Read More : IPCC: ముందుకొచ్చిన సముద్రం.. వైజాగ్, ముంబై మునిగిపోతాయా? ఐపీసీసీ రిపోర్ట్!

సోమవారం శ్రీనివాస్ తన భార్యకు ఫోన్ చేసి తిరుపతి వెళ్తున్నా అని చెప్పినట్టు ఆమె పోలీసులకు వివరించినట్టు సమాచారం. ఆ సమయంలో ఆ మహిళ శ్రీనివాస్‌తో పాటే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దర్యాప్తులో భాగంగా కారు తిరిగిన ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. తూప్రాన్‌లో ఓ చోట కారులో ముగ్గురు ప్రయాణించినట్టుగా గుర్తించారు. అయితే ఇప్పటికే శ్రీనివాస్‌, మరో మహిళ గురించి నిర్ధారణ కాగా.. మరో వ్యక్తి ఎవరన్నది తెలియాల్సి ఉంది…

Read More : Huzurabad Bypoll : అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్..గెల్లు శ్రీనివాస్ ఎవరు ?

సోమవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో శ్రీనివాస్‌ను హత్యచేసి తన కారులోనే మంగళపర్తి శివారులోని రామచంద్ర పటేల్ వ్యవసాయ భూమికి చేర్చి మృతదేహాన్ని డిక్కీలో ఉంచి దహనం చేశారు. ఆ గ్రామ సర్పంచ్‌ కంప్లైంట్‌ ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకునే సరికే కారు పూర్తిగా దగ్ధమైంది. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు. పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇటు సంఘటనా స్థలంలోనే పోలీసుల సమక్షంలో డాక్టర్ శృతితో కూడిన వైద్య బృంధం పోస్ట్ మార్టం నిర్వహించింది. ఇక శ్రీనివాస్ రావు హత్యలో ఎవరు పాలుపంచుకున్నారు? ఎక్కడ చంపారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకునేలా విచారణను సీరియస్‌గా తీసుకున్నారు.