Civils Student Pujitha Case : సివిల్స్ విద్యార్థి పూజిత ఆత్మహత్య కేసు.. నిమ్స్ డాక్టర్ అరెస్ట్

హైదరాబాద్ లో సివిల్స్ విద్యార్థిని పూజిత ఆత్మహత్య కలకలం రేపింది. పూజితను నిమ్స్ డాక్టర్ మహమ్మద్ అలీ ప్రేమ పేరుతో మోసం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

Civils Student Pujitha Case : సివిల్స్ విద్యార్థి పూజిత ఆత్మహత్య కేసు.. నిమ్స్ డాక్టర్ అరెస్ట్

Civils Student Pujitha Case : హైదరాబాద్ లో సివిల్స్ విద్యార్థిని పూజిత ఆత్మహత్య కలకలం రేపింది. పూజితను నిమ్స్ డాక్టర్ మహమ్మద్ అలీ ప్రేమ పేరుతో మోసం చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం తల్లి వైద్యం కోసం నిమ్స్ కు వెళ్లిన పూజితకు డాక్టర్ అలీ పరిచయం అయ్యాడు.

తనకు పెళ్లైన విషయం దాచి పెట్టి పూజితను ట్రాప్ చేశాడు అలీ. అయితే, అలీకి పెళ్లైన విషయం ఇటీవలే పూజితకు తెలిసింది. అతడిని నిలదీసింది. భార్యకు విడాకులు ఇస్తానని చెప్పి పూజితకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు అలీ. కానీ, అలీ మోసాన్ని తట్టుకోలేకపోయిన పూజిత ఆత్మహత్య చేసుకుంది.

Also Read..Facebook Fraud : ఫేస్‌బుక్‌తో జాగ్రత్త.. ఫ్రెండ్‌షిప్ చేసింది, కోటి రూపాయలు పోగొట్టుకుంది

పూజిత(27) సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ లోని రాయల్ విల్లా కాలనీలో ఓ గది అద్దెకు తీసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న పూజిత.. సడెన్ గా సూసైడ్ చేసుకుంది. గదిలోని కిటికీకి చున్నీతో ఉరివేసుకుంది. గదిలోంచి మృతదేహం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read..Gujarat: ఆన్‭లైన్‭లో కూతురి అసభ్యకరమైన వీడియో.. ప్రశ్నించినందుకు ఆర్మీ జవాన్‭ను‭ కొట్టి చంపారు

పూజిత మూడు రోజుల క్రితం చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూజితతో క్లోజ్‌గా ఉన్న నిమ్స్ డాక్టర్ మహ్మద్ అలీ పైనే పూజిత తల్లిదండ్రులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురి చావుకి కారణం అతడే అని వారు ఆరోపిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పూజిత మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. కూతురు కలెక్టర్ అయి సమాజ సేవ చేస్తుందనుకుంటే.. ఇలా అర్థాంతరంగా తమను వదిలి వెళ్లిపోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు.