Facebook Fraud : ఫేస్‌బుక్‌తో జాగ్రత్త.. ఫ్రెండ్‌షిప్ చేసింది, కోటి రూపాయలు పోగొట్టుకుంది

ఫేస్ బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. వాట్సాప్ లో చాట్ చేశాడు. విలువైన బహుమతులను పంపిస్తున్నట్లు బిస్కట్ వేశాడు. అక్షరాల కోటి 20 లక్షలకు ముంచేశాడు. ఇది హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ వేదన. ఫేస్ బుక్ లో ఫ్రెండ్ షిప్ చేసిన ఆమె.. కోటి 20లక్షలు పోగొట్టుకుంది.

Facebook Fraud : ఫేస్‌బుక్‌తో జాగ్రత్త.. ఫ్రెండ్‌షిప్ చేసింది, కోటి రూపాయలు పోగొట్టుకుంది

Facebook Fraud : ఫేస్ బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. వాట్సాప్ లో చాట్ చేశాడు. విలువైన బహుమతులను పంపిస్తున్నట్లు బిస్కట్ వేశాడు. అక్షరాల కోటి 20 లక్షలకు ముంచేశాడు. ఇది హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ వేదన. ఫేస్ బుక్ లో ఫ్రెండ్ షిప్ చేసిన ఆమె.. కోటి 20లక్షలు పోగొట్టుకుంది.

విదేశాల నుంచి గుర్తు తెలియని వ్యక్తి పంపిన ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసిన మహిళ నిలువునా మోసపోయింది. నమ్మకంగా కొన్నాళ్లు చాట్ చేసిన మోసగాడు.. బహుమతులు పంపిస్తున్నానని చెప్పి తన గ్యాంగ్ సాయంతో దోచేశాడు. ఢిల్లీ, ముంబైల కేంద్రంగా నైజీరియన్ ముఠా సాగిస్తున్న మోసాలకు బలైపోయిన ఆ మహిళ చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ కు చెందిన మహిళకు విదేశాల నుంచి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాట్సాప్ లో చాటింగ్ నడిచింది. ఆ వ్యక్తి మహిళ దగ్గర నమ్మకం పొందాడు. ఆ తర్వాత తన కన్నింగ్ ప్లాన్ అమలు చేశాడు. బహుమతులు పంపిస్తానని ఆమెకు వల వేశాడు. ల్యాప్ టాప్, బంగారం, కరెన్సీ పంపిస్తున్నట్లు ఊరించాడు. వాటి ఫోటోలు కూడా పంపాడు.

Also Read..Facebook Took Life : ఫేస్ బుక్‌తో జాగ్రత్త..! యువకుడి ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం, ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్

ఆ గిఫ్ట్ లను చూసిన మహిళ టెంప్ట్ అయిపోయింది. భలే మంచి చాన్స్ అని మురిసిపోయింది. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారుల పేరిట ఆమెకు నకిలీ ఫోన్ కాల్స్ వచ్చాయి. గిఫ్ట్ లు పంపాలంటే ముందు ట్యాక్స్ కట్టాలని చెప్పారు. వారి మాటలను ఆ మహిళ నమ్మేసింది. డబ్బు ఇచ్చేందుకు ఓకే చెప్పింది.

అంతే.. కస్టమ్స్, ఐటీ, ఈడీ పేరిట ఆమె నుంచి అక్షరాల కోటి రూపాయల 20లక్షలు వసూలు చేశాడు కేటుగాడు. ఆ తర్వాత జంప్ అయ్యాడు. తాను మోసపోయాను అని ఆమె తెలుసుకునేలోపే భారీ నష్టం జరిగిపోయింది. ఇదంతా చీటింగ్ అని తెలిసి ఆమె లబోదిబోమంది. ఈ ఘరానా మోసం వెనుక నైజీరియన్ ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.(Facebook Fraud)

ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్టులతో జాగ్రత్త-సైబర్ క్రైమ్ ఏసీపీ
”హైదరాబాద్ కు చెందిన మహిళ రెండు రోజుల క్రితం మాకు ఫిర్యాదు చేసింది. ఆమెకు ఫేస్ బుక్ లో లియానార్డో మేటియో అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను యూకేలో ఉంటానని చెప్పాడు. ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె వెంటనే యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. ఆ వ్యక్తి మీద ఆమెకు నమ్మకం కలిగింది. ఆ వ్యక్తి గుడ్ ఫ్రెండ్ అనే నమ్మకం ఏర్పడింది.

మన ఫ్రెండ్ షిప్ కి గుర్తుగా నేనొక గిఫ్ట్ పంపుతున్నా, దాన్ని రిసీవ్ చేసుకో అని ఆ మహిళకు చెప్పాడు. గిఫ్ట్ లో ఏమేం పంపుతున్నాడో తెలుపుతూ వాటి ఫోటోలు కూడా పంపించాడు. అందులో ఒక ల్యాప్ ట్యాప్, ఐఫోన్, గోల్డ్ జువెలరీ, క్యాష్ ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా గిఫ్ట్ ప్యాక్ లో పెట్టానని చెప్పాడు. అతడు చెప్పేది నిజమే అని ఆమె గుడ్డిగా నమ్మేసింది. ఆ తర్వాత ఎయిర్ పోర్టు అధికారులం అంటూ ఆమెకు కొందరు కాల్ చేశారు.

Also Read..Sullurupeta Chits Scam : సూళ్లూరుపేటలో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ.12 కోట్లతో మహిళ పరార్

మీరు కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలి అని ఆమెతో చెప్పారు. ఆ మహిళ తన ఫేస్ బుక్ ఫ్రెండ్ లండన్ లో డాక్టర్ గా చెప్పుకున్న వ్యక్తిని ఈ ట్యాక్స్ గురించి అడిగింది. అవును, ఇండియా రూల్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సిందేనని అతడు చెప్పాడు. కస్టమ్స్ ట్యాక్స్ పే చేశాక, ఇందులో డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నందున ఇది క్రైమ్ అవుతుంది, నీ మీద కేసు పెడతామని మహిళను బెదిరించి పెద్ద అమౌంట్ వేయించుకున్నారు.

ఆ తర్వాత ఇన్ కమ్ ట్యాక్స్ అని చెప్పి, కన్వర్షన్ చార్జ్ అని చెప్పి, విదేశాల నుంచి వచ్చింది కనుక మనీ లాండరింగ్ చార్జెస్ట్ కట్టాలని చెప్పారు. యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పారు. ఇలా రకరకాల పేర్లు చెప్పి మొత్తంగా ఆ మహిళ నుంచి కోటి 20లక్షల రూపాయలు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు వేయించుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నిజం ఏంటంటే.. ఫారినర్స్ ఎవరూ కూడా తెలియని ఇండియన్స్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపరు. వైట్ స్కిన్ ఉన్న వాళ్లు ఇండియన్స్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం అన్నది అస్సలు జరగదు. పరిచయం ఉన్న వాళ్లు అయితే పంపుతారు తప్ప స్ట్రేంజర్స్ కి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పంపరు. ఒకవేళ పంపారంటే అది ఫేక్ అని భావించాలి. ఢిల్లీలో ఉండే నైజీరియన్స్ ఇలాంటి ఫ్రాడ్స్ అన్నీ చేస్తుంటారు. ఫారినర్స్ పేరుతో ఫేస్ బుక్ ద్వారా రిక్వెస్ట్ వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చెయ్యకూడదు” అని సైబర్ క్రైమ్ ఏసీపీ హెచ్చరించారు.