Singareni Retirement : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంచిన సీఎం కేసీఆర్

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను, సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Singareni Retirement : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు పెంచిన సీఎం కేసీఆర్

Cm Kcr

Singareni Retirement : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26న జరిగే బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్ ను, సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు కార్మికుల పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ది చేకూరుతుంది. రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.

జులై 16న సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘనాయకులు,సింగరేణి ప్రాంతం ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిసి పదవీ విరమణ వయస్సు పెంచాలని వినతి పత్రం అందచేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సింగరేణి ప్రాంత సమస్యలు మొదలైన వాటిపై స్ధానిక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.