Kinnera Mogulaiah : పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కోటి రూపాయలు, ఇంటి స్థలం.. కేసీఆర్ భారీ నజరానా

హైదరాబాద్ లో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలు ప్రకటించారు కేసీఆర్. తెలంగాణ గర్వించ దగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగులయ్య అభినందనీయుడు..

Kinnera Mogulaiah : పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కోటి రూపాయలు, ఇంటి స్థలం.. కేసీఆర్ భారీ నజరానా

Kinnera Mogulaiah Kcr

Kinnera Mogulaiah : పద్మశ్రీ కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్ లో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయల రివార్డ్ ప్రకటించారు కేసీఆర్. ఇటీవల దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీకి ఎంపికైన దర్శనం మొగులయ్య శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా మొగులయ్యను శాలువాతో సత్కరించారు కేసీఆర్.

తెలంగాణ గర్వించ దగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగులయ్య అభినందనీయుడు అని కేసీఆర్ అన్నారు. మొగులయ్యకు పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొగులయ్యకు ఇంటి స్థలం, నగదు పురస్కారం ప్రకటించిన కేసీఆర్.. ఇందుకు సంబంధించి మొగులయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు. ఇప్పటికే మొగులయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని, గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ, కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని కేసీఆర్ మరోసారి చెప్పారు.

Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన

తర తరాల నుంచి వచ్చిన ఆస్తిని కాపాడుకోవాలన్న తాపత్రయం చాలా మందికి ఉంటుంది. కానీ తాత ముత్తాల నుంచి వస్తున్న కళని కాపాడుకోవాలని తపన పడ్డాడు మొగులయ్య. అదే ఆయనకు పద్మశ్రీని తెచ్చిపెట్టింది. 12 మెట్ల కిన్నెరను వాయించడంలో మొగులయ్య నేర్పరి. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. పూట గడవని జీవితం. దుర్భర దారిద్ర్యం. భార్య, 9మంది పిల్లలను పోషించడం కోసం చాలా కష్టాలు పడ్డాడు.

దర్శనం మొగులయ్యది నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరి తరం కళాకారుడు. కిన్నెరమెట్ల కళ అత్యంత అద్భుతమైందన్న మొగులయ్య.. ఈ కళ నాతోనే అంతమవుతుందా అనే మనోవేదనతో ఉన్న సమయంలో.. పద్మశ్రీ పురస్కారం వచ్చిందన్నారు. దీని ద్వారా తన కళకు జీవం పోశారన్నారు. సీఎం కేసీఆర్‌ ఈ కళను గుర్తించి, పురస్కారాన్ని ఇవ్వడంతో అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చారు. కాగా, మొగిలయ్య.. 12 మెట్ల కిన్నెర‌ను వాయిస్తుంటే అంద‌రూ మైమ‌రచిపోవాల్సిందే. ప్రాచీన సంగీత వాయిద్యం కిన్నెర‌నే బ‌తుకుదెరువుగా మ‌లుచుకున్న క‌ళాకారుడు మొగుల‌య్య‌.

Type-2 Diabetes: డిన్నర్ లేటవుతుందా.. షుగర్ పెరుగుతుందన్న మాటే..

అంతరించిపోతున్న కిన్నెర కళని ఈ తరానికి రుచి చూపించాడు మొగులయ్య. కాగా, భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడటంతో.. దర్శనం మొగులయ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. అంతకు ముందు వరకు కొంతమందికి మాత్రమే తెలిసిన మొగిలయ్య.. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ తో ఫేమస్ అయ్యాడు.