Telangana Assembly : ‘బీజేపీకి ఇంత అహంకారమా? అధికారం తలకెక్కితే కాలం సమాధానం చెబుతుంది’ : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఇంత అహంకారమా? అధికారం తలకెక్కితే కాలం సమాధానం చెబుతుంది అంటూ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

Telangana Assembly : ‘బీజేపీకి ఇంత అహంకారమా? అధికారం తలకెక్కితే కాలం సమాధానం చెబుతుంది’ : కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR criticizes BJP government in Telangana assembly meetings

CM KCR slams PM Modi IN Assembly : అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్ర విద్యుత్ బిల్లులపై చర్చ జరుగుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని 36 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చి దేశాలన్ని ఏలుతున్న బీజేపీ ప్రభుత్వానికి అంతం అహంకారమా? అధికారం తలకు ఎక్కితే కాలం సమాధానం చెబుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశం పెద్ద పెద్ద నేతలనే చూసింది..ఇటువంటి అహంకారంగా వ్యవహరించే నేతలు ఒక లెక్కా అంటూ పరోక్షంగా ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also read : Telangana Assembly : ఫోటోల కోసమే పనిచేస్తున్నామా? అంటూ కేంద్రంపై భట్టి ఫైర్ .. కాంగ్రెస్ నేత విమర్శలపై సర్వత్రా ఆసక్తి

గాంధీజీలాంటి మహానుభావులు పుట్టిన ఈ దేశంలో ఇటువంటి మరుగుజ్జులు దాపురించారు అంటూ తనదైనశైలిలో సెటైర్లు వేశారు సీఎం కేసీఆర్. విభజన హామీల పరంగా తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్ర అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారం ఎంతో కాలం నిలవదని..మరికొన్ని నెలల్లో పతనం కాక తప్పదని..మరో 18-20 నెలల్లో బీజేపీ ప్రభుత్వం దిగిపోక తప్పదని అన్నారు. తాను బీజేపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని వీటిపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడా సిద్ధంగా ఉన్నానని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.

తెలంగాణలో బీజేపీకి తోకల్లా ముగ్గురంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు..వారి మా ప్రభుత్వాన్ని కూలగొడతారంటూ అంటూ ఎద్దేవా చేశారు. గోల్ మాల్ గోవిందా అన్నట్లుగా బీజేపీ తీరు ఉంటుందిని అటువంటివారు చెప్పేది ఎక్కడా ఇంత వరకు జరిగింది లేదంటూ ఎద్దేవా చేశారు.అన్ని రంగాలను నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం కన్ను ప్రస్తుతం వ్యవసాయం, విద్యుత్‌ రంగాలపై పడిందని వాటిని నాశనం చేసేదాకా నిద్రపోదు అంటూ విమర్శించారు. ఇప్పటికే ఓడరేవులు, విమానాలు, అన్నీ పాయే.. రైలుపాయే.. రైలు స్టేషన్లు పాయే.. అన్నింటికి అన్నిపోతున్నయ్‌.

Also read : CM KCR : ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది .. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది : కేసీఆర్

ఇప్పుడు వ్యవసాయం, విద్యుత్‌ రంగాలపై కన్నేశారని విమర్శించారు. బాన్సువాడ రైతులు ధాన్యం తీసుకుపోయి పంజాబ్‌లో అమ్ముతారా? అయ్యేపనేనా? గిట్టుబాటు అయ్యేపనేనా? చెప్పడానికి ఎక్కడ అమ్ముకోవచ్చు కాదా.. మంచిది కదా? ఫ్రీ మార్కెట్‌? దుబ్బాక వాళ్లు వచ్చి సిద్ధిపేటలో అమ్మే పరిస్థితి ఉండదు. రవాణా చార్జీలకే పోతే.. వీళ్లు పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ రేట్లతో. వ్యవసాయ చేయలేకుంటనే అవుతోంది.. ఎకరం దున్నాలంటే గతంలో ఎంత అయ్యేది? ఇప్పుడు ఎంత అవుతోందో రైతులు గమనిస్తున్నారని అన్నారు సీఎం కేసీఆర్. విద్యుత్ సంస్కరణల పేరుతో దేశాన్ని దగా చేస్తున్నారు..పోరాటాల పటిమ గల తెలంగాణ ప్రజలు బీజేపీ బెదిరింపులకు భయపడరని అన్నారు. నేనే చేసిన విమర్శలు అబద్ధమని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. విశ్వగురువు అని చెప్పుకుంటున్న మోడీ బండారం బటయపెడితే దేశంపరువు పోతుందన్నారు.

శ్రీలంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ప్రజలు నినదించారని..అది మోడీకున్న పాపులారిటి అంటూ ఎద్దేవా చేశారు. మోడీ చెప్పటం వల్లే తాము అదానీకి కాంట్రాక్టు ఇచ్చామని శ్రీలం విద్యుత్ శాఖే స్వయంగా చెప్పారని వివరించారు. మన దగ్గర దొరికే బొగ్గు కాదని 10 శాతం విదేశీ బొగ్గు కొనాలని ఆర్డర్ ఇచ్చారని..ఆస్ట్రేలియాలో తన మిత్రులకు మోదీ బొగ్గు కాంట్రాక్టులు కట్టబెట్టాలని చూస్తున్నారంటూ విమర్శించారు కేసీఆర్. అహకారానికి పోయిన జర్మనీ నియంత హిట్లర్ లాంటివారే కాలగర్భంలో కలిసిపోయారని చెడ్డపేరు తెచ్చుకున్నారని అటువంటిది 36 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు ఓ లెక్కా అంటూ విరుచుకుపడ్డారు కేసీఆర్.

బీజేపీకి ప్రధాన ఎజెండా తనకు వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్ లను కూలగొట్టటం తాను గద్దె ఎక్కటం ఒకటే ప్రధానంగా పెట్టుకుందని అలా ఇప్పటి వరకు 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టింది అంటూ అదే పంథాను తెలంగాణలో ఉపయోగించాలని చూస్తోందని కానీ తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడవకని తేల్చి చెప్పారు కేసీఆర్.