CM KCR: ముందస్తు ఎన్నికలు ఉండవు.. త్వరలో వరంగల్లో భారీ బహిరంగ సభ: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

త్వరలో వరంగల్ లో భారీ బహిరంగ సభ పెడతామని కేసీఆర్ తెలిపారు. ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో ప్రతినిధుల సభ జరుపుతామని అన్నారు. సర్వేలు అన్నీ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు నేతలు సిద్ధంగా ఉండాలని కూడా కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక నేతలు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.

CM KCR: ముందస్తు ఎన్నికలు ఉండవు.. త్వరలో వరంగల్లో భారీ బహిరంగ సభ: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

CM KCR

CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ బీఆర్‎ఎస్ పార్టీ విస్తృత‎స్థాయి సమావేశం జరిగింది. ఇందులో కేసీఆర్ తమ పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. బీజేపీ సభలకు కౌంటర్ సభలు పెట్టాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని అన్నారు.

ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని, పాదయాత్రలు చేసి వారి సమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ సూచించారు. నియోజక వర్గాల వారీగా పర్యటించాలని చెప్పారు. వీలైనంత వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

త్వరలో వరంగల్ లో భారీ బహిరంగ సభ పెడతామని కేసీఆర్ తెలిపారు. 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ ఉంటాయన్నారు. వచ్చే నెల వరకు ఆత్మీయ సమ్మేళనాలు ఉంటాయని చెప్పారు. వచ్చే నెల 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ, 25న గ్రామస్థాయిలో పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో ప్రతినిధుల సభ జరుపుతామని అన్నారు. వచ్చేనెల 30న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం ఉంటుందని గుర్తు చేశారు.

సర్వేలు అన్నీ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు నేతలు సిద్ధంగా ఉండాలని కూడా కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక నేతలు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజలకు మరింత దగ్గర కావాలని చెప్పారు. కాగా, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమేనని ప్రతిపక్షాలు అంటున్నాయి.

K.Kavitha hunger strike: దీక్ష విరమణ.. మహిళా రిజర్వేషన్లను సమర్థిస్తూ పలువురు సంతకాలు చేశారన్న కవిత