Suryapet : సూర్యాపేటలో కుప్పకూలిన గ్యాలరీ..ముఖ్యాంశాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

సూర్యాపేటలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 47వ జాతీయ జూనియర్‌ స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలింది.

Suryapet : సూర్యాపేటలో కుప్పకూలిన గ్యాలరీ..ముఖ్యాంశాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Suryapet Nalgonda

Collapse gallery : సూర్యాపేటలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 47వ జాతీయ జూనియర్‌ స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలింది. 200మందికి పైగా గాయపడ్డారు. వారిలో 100మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల క్రింద గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

1. 47వ జాతీయ సబ్‌ జూనియర్‌ కబడ్డి పోటీల్లో ప్రమాదం
2. సూర్యాపేటలో జరగుతున్న కబడ్డి పోటీలు
3. కబడ్డి పోటీల కోసం మూడు గ్యాలరీలు ఏర్పాటు
4. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రమాదం

5. పోటీల ప్రారంభానికి ముందే కుప్పకూలిన గ్యాలరీ
6. 7వేల మందిని లోపలికి రానిచ్చిన నిర్వాహకులు
8. రూ.కోటి వ్యయంతో స్టేడియం నిర్మాణం
9. స్టేడియంకోసం 90 టన్నుల ఇనుము, 60 టన్నుల కలప వినియోగం

10. 20 అడుగుల ఎత్తు, 240 అడుగుల వెడల్పుతో 3 గ్యాలరీలు
11. 15వేల మంది కూర్చునేలా గ్యాలరీల నిర్మాణం
12. 20 రోజులపాటు నిర్మాణాన్ని చేపట్టిన 30 మంది కార్మికులు
13. దేశంలో ఎక్కడా లేనివిధంగా అవుట్‌డోర్‌ స్టేడియం నిర్మాణం

14. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి వచ్చిన కబడ్డీ క్రీడాకారులు
15. స్టేడియంలోనే ఉన్న బాలబాలికలకు చెందిన 30 జట్లు
16. స్టేడియంలో మొత్తం 6 కబడ్డీ కోర్టుల ఏర్పాటు

47వ జాతీయ జూనియర్‌ స్థాయి కబడ్డీ పోటీలకు సూర్యాపేట ఘనంగా ముస్తాబైంది. సోమవారం నుంచి గురువారం వరకు ఈ పోటీలు జరగాల్సి ఉంది. ఇందుకోసం కోటి రూపాయల వ్యయంతో దేశంలోనే అరుదైన స్టేడియాన్ని నిర్మించారు. ఇందుకోసం 90 టన్నుల ఇనుము, 60 టన్నుల కలప వినియోగించారు. 20 అడుగుల ఎత్తు, 240 అడుగుల వెడల్పు కలిగిన మూడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 15వేల మంది కూర్చుని ఆట వీక్షించేలా 30 మంది కూలీలు 20 రోజులపాటు శ్రమించి స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ఇంత భారీ స్థాయిలో నిర్మించిన అవుట్‌డోర్‌ స్టేడియం దేశంలో ఎక్కడా లేదని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి, ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కె.జగదీశ్‌ వెల్లడించారు. 29 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి తరలివచ్చారు. బాలురు, బాలికలకు చెందిన 30 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. స్టేడియంలో మొత్తం 6 కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేశారు. రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు పోటీలు జరిగేలా షెడ్యూల్ రూపొందించారు.

గ్యాలరీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఐరన్‌తో గ్యాలరీలు నిర్మించడంతో.. వాటి కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడం కష్టంగా మారింది.