Addanki Dayakar : కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హీరోగా ‘పాన్ ఇండియా మూవీ’

సినిమా నుంచి రాజకీయాలవైపు మళ్ళిన వారిని చాలామందిని చూసాం. కానీ ఓ నేత రాజకీయాల నుంచి సినిమావైపు అడుగులేస్తున్నారు.

Addanki Dayakar : కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హీరోగా ‘పాన్ ఇండియా మూవీ’

Addanki Dayakar

Addanki Dayakar : సినిమా నుంచి రాజకీయాలవైపు మళ్ళిన వారిని చాలామందిని చూసాం. కానీ ఓ నేత రాజకీయాల నుంచి సినిమావైపు అడుగులేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన అద్దంకి దయాకర్ హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి బొమ్మక్ మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక అద్దంకి దయాకర్‌కు భార్యగా సినీ నటి ఇంద్రజ నటిస్తున్నారు. ఈ సినిమాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు నటించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా సమాచారం.

చదవండి : T.Congress : డి.శ్రీనివాస్ కొడుకు కూడా కాంగ్రెస్ లో చేరాలి – వీహెచ్

కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు తెలిసింది.. అయితే ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే పేర్లను పరిశీలిస్తున్నారని అద్దంకి తెలిపారు. బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలు ఈ మూవీలో ఉంటాయని అద్దంకి దయాకర్ వివరించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రస్తుతం నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఇది వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు ప్రెస్ మీట్లు, టీవీ డిబేట్లలో కనిపించిన దయాకర్, సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తుండటంతో అతడి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చదవండి : Congress On Gogoi Remarks : నచ్చినప్పుడు రాజ్యసభకు వెళ్తానన్న గొగొయ్..పార్లమెంట్ కు అవమానమన్న కాంగ్రెస్